'కొంటె కుర్రాడు' టైటిల్ పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,June 16 2020]

ఎస్.ఎమ్.ఫోర్ ఫిలిమ్స్,బ్యానర్ లో మాస్ మహారాజ రవితేజ అభిమాని ఎమ్.ఎన్.వి.సాగర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తు నిర్మిస్తున్న చిత్రం కొంటె కుర్రాడు (ఓ లోఫర్ గాడి ప్రేమ కథ) అనేది ఉపశీర్షిక. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పునర్జన్మ నేపథ్యంలో ట్రయాంగిల్ మాస్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది, బ్యానర్ లోగో, టైటిల్ పోస్టర్ లోగోని హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు కొంటె కుర్రాడు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ఎమ్.ఎన్.వి.సాగర్ మాట్లాడుతూ... మాస్ మహారాజ రవితేజను ఆదర్శనంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాను. నా ఒక్కడితో మొదలైన ఈ సినిమాలో ఎనభై శాతం మాస్ మహా రాజా డై హార్డ్ ఫ్యాన్స్ వర్క్ చేస్తున్నారు. ఆయన అభిమానిగా నేను చేస్తున్న ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది, క్లైమాక్స్ ఊహాలకి అందని ట్విస్టులతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఆర్టిఎఫ్స్ అందరూ కూడ తమ సొంత సినిమాల భావించి సపోర్ట్ చేస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.

ఈ సినిమా లో అన్ని పాటలు కధకనుగుణంగా మంచి ట్యూన్స్ కుదిరాయి.మాస్ మహా రాజా సినిమా టైటిల్స్ తో విడుదల చేసిన తొలి పాటకి యూట్యూబ్ లో మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా తో నాకు మంచి పేరు వస్తుంది అని సంగీత దర్శకుడు అరమాన్ మెరుగు అన్నారు.
రవితేజ గారి వీరాభిమాని ని అయిన నాకు సాగర్ అన్న తెరకెక్కిస్తున్నా కొంటె కుర్రాడు సినిమా లో భాగం అయ్యే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని కో ప్రొడ్యూసర్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

అద్భుతమైన కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని డిఓపి. సి ఎస్ చంద్ర అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఎమ్ ఎన్ వి సాగర్.

More News

బోల్డ్ రోల్‌తో ఆడియెన్స్‌ ను మెప్పిస్తుందా?

ఈషా రెబ్బా.. వెండితెరపై రాణించాలని ఆరాట‌ప‌డుతున్న తెలుగు హీరోయిన్‌.

నాగ్ నెక్ట్స్ మూవీ ఓకే అయిన‌ట్లేనా?

అగ్ర క‌థానాయ‌కుల్లో కింగ్ నాగార్జున ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. సినిమాల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సురేంద‌ర్ రెడ్డి ఎటు వైపు మొగ్గుతాడు?

ద‌ర్శ‌కుడిగా ప‌దిహేనేళ్ల కెరీర్ ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది మాత్రం తొమ్మిది సినిమాలు మాత్ర‌మే..

బ్రేక్ తీసుకున్న త్రిష‌

డ‌స్కీ బ్యూటీ త్రిష బ్రేక్ తీసుకోవాల‌నుకుంటుది. అస‌లు ఇంత‌కూ త్రిష ఎందుకు బ్రేక్ తీసుకోవాల‌ని అనుకుంటుంది?

అనుష్క ఎమోష‌న‌ల్ పోస్ట్‌

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోన్న అనుష్క శెట్టి త‌న నిశ్శ‌బ్దం సినిమా విడుద‌ల కోసం వేచి చూస్తుంది.