ఎంటర్టైన్మెంట్ యూనివర్సిటీ పెట్టాలనేది నా గోల్..! కోనేరు సత్యనారాయణ
Send us your feedback to audioarticles@vaarta.com
పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు. అయినప్పటికీ కళామాతల్లి అందర్నీ అన్ని విధాలా ఆదుకుంటూనే ఉంటుంది. కాగా ఇలా విద్యారంగంలో కేఎల్ యూనివర్శిటీ చైర్మన్‌గా పేరుగాంచిన కోనేరు సత్యనారాయణ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే హవీష్ హీరోగా చేసిన ‘జీనియస్’ సినిమాకు పార్టనర్‌గా వ్యవహరించిన ఆయన.. తాజాగా ‘రాక్షసుడు’ అనే రీమేక్ చిత్రాన్ని నిర్మించారు.
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 2న అభిమానుల ముందకు రాబోతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్, ట్రైలర్స్ సూపర్బ్ అనిపించాయి. ఆగస్ట్-02న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించేశారు. తాజాగా.. నిర్మాత కోనేరు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తాను విద్యారంగం నుంచి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు..? నిర్మాతగా ఎలా మారారు. రాక్షసుడు సినిమా ఎలా ఉంది..? ఇలా పలు ఆసక్తికర విషయాలను కోనేరు మీడియాతో పంచుకున్నారు.
నిర్మాణ రంగంవైపు ఎందుకొచ్చారు..!?
నేను ప్రస్తుతం ప్రఖ్యాత కెఎల్ యూనివర్సిటీకి ఛైర్మన్‌గా కొనసాగుతున్నాను. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నాను. మా కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ నేషనల్ వైజ్‌గా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినీ నిర్మాణం వైపు రావడానికి కారణం మాత్రం మా అబ్బాయి హవీషే. ‘జీనియస్’ సినిమాకు పార్టనర్‌గా వ్యవహరించాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాతోనే పూర్తిస్థాయి నిర్మాతగా మారాను. మొదట హవీష్‌ను హీరోగా ఈ రాక్షసుడు సినిమా చేద్దామనుకున్నాను. ఇప్పటికే హవీష్ ఇలాంటి జోనర్‌లోనే ఆల్ రెడీ ఓ సినిమా చేస్తుండటంతో బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా తీసుకోవడం జరిగింది. ‘రాక్షసన్’ స్క్రిప్ట్‌లో ఒక్క అక్షరం కూడా మార్చలేదు.
హీరో, హీరోయిన్ గురించి..!
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా నేను ఇంతకు ముందు ఒకే ఒక్క సినిమా చేశాను. ఈ కథకు శ్రీనివాస్ అయితే బాగా సెట్ అవుతాడని భావించి హీరోగా తీసుకున్నాను. నిజంగా శ్రీనివాస్ చాలా బాగా నటించాడు. ఎమోషన్ని అండ్ యాక్షన్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇక హీరోయిన్ విషయానికొస్తే.. మొదట ఈ సినిమాలో హీరోయిన్గా పెద్ద హీరోయిన్లను తీసుకోవాలనుకున్నాం. రాశీఖన్నా లాంటి హీరోయిన్స్‌తో కూడా మాట్లాడాము. కానీ అనుపమ పరమేశ్వరన్ తీసుకున్నాం. తను చాలా బాగా నటించింది. సినిమాలో టీచర్ రోల్లో నటించింది.
ఎంటర్టైన్మెంట్ యూనివర్సిటీ పెట్టాలనేది నా గోల్..!
కథ కథనం మాటలే సినిమాకి ప్రాణం.. కానీ మనవాళ్ళు మాత్రం ఏదో హడావుడిగా కథ మాటలు రాయించుకోని ప్రొడక్షన్‌కి వెళ్ళిపోతుంటారు.. ఇదంతా పక్కా రాంగ్. అలాగే పోస్ట్ ప్రొడక్షన్‌కి సంబధించిన పనులు కూడా చాలా క్లారిటీ ఉండాలి.. నేను అయితే ఇలానే ఫాలో అవుతాను. ఇవన్నీ ఒక ఎత్తయితే సినిమా రిలీజ్ కూడా చాలా ముఖ్యం. భవిష్యత్తులో నేను ఎంటర్టైన్మెంట్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నాను. ఇదే నా గోల్. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇందులో మా అబ్బాయి సినిమా కూడా ఒకటి ఉంది.
కాగా.. వరుస ప్లాప్‌లతో బెల్లకొండ శ్రీనివాస్ తెగ బాధపడిపోతున్నారన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ‘రాక్షుసుడు’గా మారిన బెల్లండ సినిమాను సినీ ప్రియులు సక్సెస్ దాకా తీసుకెళ్తారో లేకుంటే పెవీలియన్‌కు పంపుతారో తెలియాలంటే ఆగస్ట్-2 వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఎంటర్టైన్మెంట్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్న కోనేరుకు.. www.indiaglitz.com ఆల్ ది బెస్ట్ చెబుతోంది. మీ యూనివర్శిటి ఎంతో మంది నటీనటులను తీర్చిదిద్ది ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆకాంక్షిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments