రేవంత్ వల్ల పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్: కోదండ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. రేవంత్ అత్యుత్సాహం వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని మండిపడుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డిలు ఇప్పటికే రేవంత్ తీరును ఖండించగా... తాజాగా ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోందడ రెడ్డి తప్పుపట్టారు. రేవంత్ అత్యుత్సాహం వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. తొలి రెండు రోజులు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు పార్టీ గ్రాఫ్ ను పెంచిందని ... కానీ మూడో రోజు రేవంత్ చేసిన వ్యాఖ్యలు గ్రాఫ్ ను తగ్గించాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విద్యుత్ సమస్యలపై మాట్లాడలేదన్న రేవంత్... తన పరిధిలో తాను ఉండాలని హెచ్చరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలో వారికి తెలుసని... మీరు చెప్పాల్సిన పని లేదన్నట్లు వ్యాఖ్యానించారు. నల్లమలలో యురేనియం తవ్వకాల విషయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు ఏబీసీడీలు కూడా తెలియదన్న రేవంత్ కామెంట్స్.... తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు కోదండ రెడ్డి. యురేనియం అంశంపై వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్ ముందే ఏఐసీసీకి నివేదిక ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో రేవంత్ వ్యవహారంపై చర్చించినట్లు వెల్లడించారు.
మరో వైపు హుజూర్ నగర ఉప ఎన్నిక విషయంలోనూ ఉత్తమ్ రెడ్డి, రేవంత్ మధ్య వార్ జరుగుతోంది. హుజూర్ నగర్ టికెట్ తన సతీమణి పద్మావతికి ఇవ్వాలని ఉత్తమ్... స్ధానికులు శ్యామల కిరణ్ రెడ్డికి ఇవ్వాలని రేవంత్ పట్టుబడుతున్నారు. ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాను సైతం ప్రశ్నించారు రేవంత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments