Konda Surekha:రాహుల్ గాంధీ యాత్రలో కొండా సురేఖకు తప్పిన పెను ప్రమాదం

  • IndiaGlitz, [Thursday,October 19 2023]

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండా సురేఖకు పెద్ద ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో సురేఖ పాల్గొన్నారు. ఈ ర్యాలీకి వేలాది మంది పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో ఆమె ముఖం, చేతులకు గాయాలయ్యాయి. తక్షణమే ఆమెను హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ముఖం కుడి భాగంతో పాటు చేతులు, కాళ్లుకు స్వల్ప గాయాలయ్యాయన్నారు. ఆమె తలకి దెబ్బ తగలడంతో కొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సురేఖ గాయపడిన విషయం తెలుసుకున్న ఆమె భర్త కొండా మురళి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడ్డ భార్యను చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు.

బైక్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జెన్‌కో అతిథిగృహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఇందులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీనియర్‌ నేత మధుయాష్కీతో పాటు మరికొందరు ముఖ్యనేతలు పాల్గొన్నారు. జెన్‌కో అతిథిగృహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. విజయభేరి బస్సు యాత్రలో భాగంగా రెండో రోజు రాహుల్‌ గాంధీ పర్యటన భూపాలపల్లి నుంచి కాటారం వరకు కొనసాగింది.

దొరల తెలంగాణ... ప్రజల తెలంగాణకు మధ్య పోటీ..

కాటారం జంక్షన్‌లో రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణ... ప్రజల తెలంగాణకు మధ్య పోటీ అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతోందని.. పదేళ్ల నుంచి ఒకే కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తోందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని రాహుల్ ఆరోపించారు. విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెడుతున్నారని.. కానీ కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా లేదన్నారు. బీజేపీ-ఎంఐఎం పరస్పర సహకారం అందించుకుంటున్నాయని.. అలాగే పార్లమెంటులో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతోందని రాహుల్ వెల్లడించారు.

More News

Sharmila:ఈ డ్రామాలన్నీ ఎందుకు చిన్న దొర? ఓట్ల కోసమే కదా: షర్మిల

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు.

CM Jagan:చంద్రబాబు పాలనంతా అవినీతి మయం.. సీఎం జగన్ తీవ్ర విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో

Lokesh:లోకేష్ బస్సు యాత్ర.. భువనేశ్వరి పరామర్శ యాత్రకు రంగం సిద్ధం..

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఆగిపోయిన పార్టీ కార్యక్రమాలను మళ్లీ యాక్టివ్ చేసేందుకు నేతలు రెడీ అయ్యారు.

NTR:ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఆస్కార్ 'యాక్టర్స్ బ్రాంచ్‌'లో చోటు

RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో అరుదైన గుర్తింపు సాధించారు.

Nadendla:జగన్ రెడ్డి పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయింది.. ఎవరినీ కదిలించినా కన్నీరే..

సీఎం జగన్ రెడ్డి పాలనలో ఏపీ అంధకారంలో కూరుకుపోయిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.