శ్రీదేవి తో సినిమా చేస్తున్న కోన...?

  • IndiaGlitz, [Saturday,September 26 2015]

రైట‌ర్ గా ఎన్నో స‌క్సెస్ ఫుల్ మూవీస్ కి వ‌ర్క్ చేసి...ప్ర‌జెంట్ ఫుల్ బిజీగా ఉన్న క్రేజీ రైట‌ర్ కోన వెంక‌ట్. బ్రూస్ లీ, అఖిల్, డిక్టేట‌ర్...ఇలా ఒక‌టేమిటి ఏ స్టార్ హీరో సినిమా తీసుకున్నా...దానికి రైట‌ర్ మాత్రం కోన వెంక‌టే. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...గ‌తంలో కోన వెంక‌ట్ అతిలోక సుంద‌రి శ్రీదేవితో సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. ఆత‌ర్వాత ఏమైందో ఏమో..కానీ మ‌ళ్లీ ఆ సినిమా ప్ర‌స్త‌వ‌నే రాలేదు.

అయితే ఇదే విష‌యం గురించి...శ్రీదేవిని అడిగితే..కోన వెంక‌ట్ నాకు క‌థ చెప్పారు. బాగా న‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి.ఈ సినిమా చేస్తున్నాను. బ‌హుశా రెండు, మూడు నెల‌ల్లో ఈ సినిమా ప్రారంభం అవుతుంద‌ని చెప్పారు. ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన‌ బాహుబ‌లి సినిమాలోనే న‌టించ‌న‌ని చెప్పిన శ్రీదేవి..కోన చెప్పిన క‌థ న‌చ్చి సినిమా చేస్తున్నాను అని చెప్పారంటే...కోన వెంక‌ట్ ఎంత మంచి క‌థ చెప్పారో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే కోన‌ ఎలాంటి క‌థ చెప్పారు..? అది ఏ త‌ర‌హా చిత్రం... ఇలాంటి వివ‌రాలు తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.