కొత్త జోన‌ర్ సినిమాలు చేయాల‌నే మా ప్ర‌య‌త్నాన్ని 'నీవెవ‌రో' తో ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ - కోన వెంక‌ట్‌

  • IndiaGlitz, [Monday,August 27 2018]

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'నీవెవరో' . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 24న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం జ‌రిగిన థాంక్స్ మీట్‌లో..

హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ - ''సినిమా రిలీజ్ అయిన రోజు శ్రావ‌ణ శుక్ర‌వారం కాబ‌ట్టి క‌లెక్ష‌న్స్ త‌క్కువ‌గా ఉన్నా కూడా.. ఈ షోకి క‌లెక్ష‌న్స్ పెరుగుతూ వ‌చ్చి ఈరోజు ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఈ రోజు మేం సినిమా చేయ‌డానికి ఏకైక కార‌ణం ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే. ఆడియెన్స్‌లో రెండు ర‌కాలుంటారు. ప‌దిశాతం మంది ప్రేక్ష‌కులు సినిమాను విశ్లేషిస్తే... మిగిలిన 90 శాతం ప్రేక్ష‌కులు సినిమాను ఎంజాయ్ చేయాల‌నుకునే వెళ్తారు. అలాంటి వారికి వంద‌శాతం న‌చ్చే సినిమా ఇది. ఈసారి చేసే సినిమా వంద‌శాతం అంద‌రికీ న‌చ్చేలానే చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం'' అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్ మాట్లాడుతూ - ''మా టీమ్ అంద‌రం క‌లిసి ఓ సైన్యంలా ప‌నిచేశాం. ఓ సినిమా న‌మ్మ‌కంతోనే మొద‌లై.. న‌మ్మ‌కంతోనే ఎండ్ అవుతుంది. న‌మ్మ‌కం దేవుడితో స‌మానం. సినిమాను తీసేవాళ్లు.. చేసేవాళ్లు.. చూసేవాళ్లు.. అంద‌రికీ జాబ్ శాటిస్‌ఫాక్ష‌న్ ఇచ్చిన సినిమా. మా టార్గెట్ రీచ్ అయ్యామ‌ని అనుకుంటున్నాం. జేబు శాటిస్‌ఫాక్ష‌న్ ఇంకా రాలేదు. ఆడియెన్స్‌కు సినిమా రీచ్ అవుతుంది. మా న‌మ్మ‌కాన్ని అంద‌రూ న‌మ్మాల‌ని లేదు. అయితే అంద‌రూ న‌మ్మే వ‌ర‌కు మంచి సినిమాలు చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతూనే ఉంటుంది. కొత్త ప్ర‌య‌త్నాలు వ‌ల్ల కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ఇండ‌స్ట్రీలోకి వ‌స్తారు. ఎం.వి.వి.స‌త్యనారాయ‌ణ‌గారు ఏడాదికి వంద‌కోట్ల ట‌ర్న్ ఓవ‌ర్ ఉంటుంది.

అలాంటి వ్య‌క్తి.. కొత్త సినిమాలు చేయాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాం. వెంకీ నుండి బాద్‌షా వ‌ర‌కు సినిమాలు చేసి స‌క్సెస్ అయినా కూడా... హౌస్ డ్రామాలు ఎన్ని రోజులు తీస్తారు అని తిట్టారు. రూట్ మార్చి ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్ పెట్టి 2014 నుండి కొత్త జ‌ర్నీ స్టార్ట్ చేశాం. కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయాల‌ని ప్రారంభించిన మా జ‌ర్నీలో మేం చేసిన నిన్నుకోరి.. ఈవాళ చేసిన నీవెవ‌రో సినిమాలు వ‌చ్చాయి. ఎంక‌రేజ్ మెంట్ అంద‌రికీ చాలా ముఖ్యం. ఈ సినిమా కోసం ఎవ‌రు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు.

కొన్ని వంద‌లు మంది .. వేల గంట‌లు ప‌నిచేస్తే.. ఓ సినిమా వ‌స్తుంది. అలాంటి సినిమాను ఓ ప‌ది రూపాయ‌ల పెన్‌తో కొట్టి ప‌డేయ‌డం స‌రికాదు.. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేద‌న‌. ఆడియెన్స్ కోస‌మే మేం సినిమాలు చేస్తాం. రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలు. సినిమా జ‌ర్నీలో చాలా ఎమోష‌న్స్ మిళిత‌మై ఉంటాయి. కొత్త ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నం మాది. మా టార్గెట్‌ని వంద‌కు వెయ్యి శాతం పూర్తి చేశాం'' అన్నారు.

ద‌ర్శ‌కుడు హ‌రినాథ్ మాట్లాడుతూ - ''మా ప్ర‌య‌త్నాన్ని ఆద‌రించిన ఆడియెన్స్‌కు థాంక్స్‌. అవ‌కాశం ఇచ్చిన కోన వెంక‌ట్‌, ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌గారికి థాంక్స్‌. ప్ర‌తి ఒక న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ధ‌న్య‌వాదాలు. ఆదిగారు త‌న న‌ట‌న‌తో క‌ల్యాణ్ అనే క్యారెక్ట‌ర్‌కి ప్రాణం పోశారు. తాప్సీ, రితికా సింగ్‌కి థాంక్స్‌'' అన్నారు.

స‌ప్త‌గిరి మాట్లాడుతూ - ''ఆదిగారు సెటిల్డ్ పెర్ఫామ‌ర్‌. త‌న‌తో పాటు కోన‌గారికి, స‌త్య‌నారాయ‌ణ‌గారికి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌'' అన్నారు.

రితికా సింగ్ మాట్లాడుతూ - ''నాలోని కొత్త కోణాన్ని ప‌రిచ‌యం చేసిన చిత్ర‌మే నీవెవ‌రో. నాపై న‌మ్మ‌కంతో నాకు అవకాశం ఇచ్చిన హ‌రినాథ్‌, కోన వెంక‌ట్‌, ఎం.వి.వి.సత్య‌నారాయ‌ణ‌గారు.. సెట్స్‌లో స‌పోర్ట్ చేసిన తాప్సీ, నీర‌జ కోన‌, తుల‌స‌మ్మ‌, శివాజీరాజాగారు స‌హా అంద‌రికీ థాంక్స్‌'' అన్నారు.

శివాజీరాజా మాట్లాడుతూ - ''ఆది తండ్రి రవిరాజా పినిశెట్టిగారి వంటి గొప్ప డైరెక్ట‌ర్ వ‌ల్ల‌నే నేను న‌టుడిగా ఎదిగాను. ఆయ‌న త‌న‌యుడు ఆది మా అందరికీ కావాల్సిన వాడే. న‌ట‌న‌లో ఆది డేడికేష‌న్ తెలిసిందే. కోన వెంక‌ట్‌కు సినిమాయే ప్ర‌పంచం. రితికా సింగ్ మంచి న‌టి.. మంచి ఎన‌ర్జీతో ఉంటుంది. సినిమా స‌క్సెస్ కావ‌డం చాలా ఆనందంగా ఉంది'' అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

More News

సొంతంగా డ‌బ్బింగ్‌...

'ఛ‌లో'తో హిట్ అందుకున్న ర‌ష్మిక తాజాగా విడుద‌లైన 'గీత గోవిందం'తో మరో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనే 'డియ‌ర్ కామ్రేడ్‌' లో న‌టిస్తుంది.

సైరాలో ట‌బు

మెగాస్టార్ 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది. పాలెగాడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

కృష్ణ బ‌యోపిక్‌...

సూప‌ర్‌స్టార్ కృష్ణ జీవిత చరిత్ర కూడా సినిమా రూపంలో తెర‌కెక్క‌నుంది. తెలుగు సినిమాను టెక్నిక‌ల్‌గా, జోన‌ర్స్ ప‌రంగా కొత్త పుంత‌లు తొక్కించిన హీరోల్లో కృష్ణ ముందు వ‌రుస‌లో ఉంటారు.

రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న‌...

'పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ' త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'క‌ల్కి'. రాఖీ సంద‌ర్భంగా సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

'న‌వాబ్' ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన కింగ్ నాగార్జున‌.. ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

గీతాంజ‌లి, బాంబే, రోజా, స‌ఖి వంటి ప్రేమ‌క‌థ‌లైనా... ఘ‌ర్ష‌ణ‌, ద‌ళ‌ప‌తి, యువ వంటి మెసేజ్ ఓరియెంటెడ్ ఎమోష‌న‌ల్ చిత్రాల‌ను రంజింప చేసేలా తెర‌కెక్కించ‌డంలో మేటి ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం.