కోన మరోసారి స‌మ‌ర్పించేసుకుంటున్నాడు

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

తెలుగులో స్టార్ ర‌చ‌యితే పేరు సంపాదించుకున్న కోన‌వెంక‌ట్‌ను గ‌తేడాది ర‌చ‌యిత‌గా దుర‌దృష్టం వెన్నాడింది. ఆయ‌న ర‌చ‌నా స‌హ‌కారంలో విడుద‌లైన శంక‌రాభ‌ర‌ణం, బ్రూస్‌లీ, అఖిల్ చిత్రాల్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లాప‌డ్డాయి. ముఖ్యంగా శంక‌రాభ‌ర‌ణం ర‌చ‌యిత‌గానే కాదు, నిర్మాత‌గా కూడా న‌ష్టాల‌ను మిగిల్చింది. ఇప్పుడు ర‌చ‌యిత‌గా కాకుండా తెలుగులో సినిమాను స‌మర్పించేసుకుంటున్నాడు.

నాగ‌చైత‌న్య‌, గౌత‌మ్‌మీన‌న్ సినిమా సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాను తెలుగులో స‌మ‌ర్పిస్తున్న కోన‌వెంక‌ట్ ఇప్పుడు మరో సినిమాకు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ట‌. అదే ప్ర‌భుదేవా, త‌మ‌న్నా న‌టిస్తున్న హ‌ర్ర‌ర్ కామెడి చిత్రాన్ని ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై తెలుగులో స‌మ‌ర్పిస్తున్నాడట‌. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు, అమ‌లాపాల్ ఎ.ఎల్‌.విజ‌య్ రూపొందిస్తుండ‌టం విశేషం.