శ్రీను వైట్ల పై కోన కేసు
- IndiaGlitz, [Thursday,October 29 2015]
డైరెక్టర్ శ్రీను వైట్ల పై భార్య రూపా వైట్ల కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఇదిలా ఉంటే..శ్రీను వైట్ల పై రైటర్ కోన వెంకట్ కేసు పెడతానంటున్నాడు. ఎందుకంటే..బ్రూస్ లీ సినిమా టైటిల్స్ లో తన పేరు వేసినప్పటికీ..తను ఇచ్చిన స్టోరీ వాడకుండా స్ర్కిప్ట్ లో చాలా మార్పులు చేసాడని..నష్టపరిహారంగా 10 కోట్లు కావాలంటూ కోన కేసు వేయనున్నాడట.
ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదితో ఈ కేసు విషయమై కోన సంప్రదింపులు జరుపుతున్నాడట. నేను ఎలాంటి కథని అందించానో..అందరు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో అవసరమైతే స్ర్కిప్ట్ ను ఆన్ లైన్ లో పెడతానంటున్నాడు కోన. ఓ వైపు పర్సనల్ లైఫ్ లో కేసు..మరో వైపు ప్రొఫిసినల్ లైఫ్ లో కేసు...పాపం శ్రీను వైట్ల.