'నీవెవరో' మా యూనిట్‌కి మెమొరబుల్ మూవీగా నిలిచిపోతుంది - కోన వెంకట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'నీవెవరో` . కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 24న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో... నందిని రెడ్డి మాట్లాడుతూ "కోనగారికి ప్రతి సినిమాకూ ఓ స్కెచ్ ఉంటుంది. ఓ గోల్ ఉంటుంది. ఈ సినిమాలో బెస్ట్ పెర్పార్మెన్స్ లు చేయగల ముగ్గురు ఇందులో ఉన్నారు. ట్రైలర్ చాలా బావుంది. థ్రిల్లర్ ఇది. గ్రేట్ మ్యూజిక్ కూడా ఉంది. పవర్ ప్యాక్డ్ ఆర్టిస్టులు ఉన్నారు" అని అన్నారు.
దశరథ్ మాట్లాడుతూ "నీవెవరో కథని కోనగారి ద్వారా విన్నాను. చాలా మంచి కథ. కొత్త కథ. చాలా ట్విస్టులున్నాయి. ఆది చాలా బాగా నటించారు. బెస్ట్ కాంబినేషన్‌తో వస్తున్న సినిమా ఇది" అని చెప్పారు.
కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ "ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. ఆయన రైటింగ్ ఎంత బావుంటుందో, ప్లానింగ్ అంత బావుంటుంది. ఆయన గీతాంజలి, నిన్నుకోరి నచ్చాయి. ఈ మధ్య నా ఫ్రెండ్స్ ఇద్దరిని కలిశాను. వారిద్దరూ ఆదిని దృష్టిలో పెట్టుకుని కథను రాస్తున్నానని అన్నారు. ఒకరు ఆది కోసం రాస్తే, ఒకరు రాసిన కథ ఆదికి సూటవుతుందని చెప్పారు. భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద హిట్లు ఆది కొట్టాలని ఆకాంక్షిస్తున్నాను" అని చెప్పారు.
రాహుల్ మాట్లాడుతూ "మూవీ ట్రైలర్స్, ప్రోమోస్ చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయి. ఎంవీవీగారి, కోనగారి సినిమాల్లో కథ, క్వాలిటీ తప్పకుండా ఉంటాయి. వాళ్లు కాంప్రమైజ్ కారు. అది కనిపిస్తోంది. 24న అది రిలీజ్ కానుంది. నేను చేస్తున్న సినిమాకు కోనగారు హెల్ప్ చేస్తున్నారు. నాలాంటి చిన్న పీత సినిమా విడుదల కావడానికి కోనగారిలాంటి పెద్ద చేతులు పైకి లాగుతున్నాయి. ఆదిగారి నటన అన్నా, ఆయన కథలు ఎంపిక చేసుకునే విధానం మాకు చాలా ఇన్‌స్పిరేషన్. ఆయనలాగా అన్ని వేరియేషన్స్ ఉన్న పెర్ఫార్మెన్స్ లు చేయాలి" అని అన్నారు.
కావ్య థాపర్ మాట్లాడుతూ "టీమ్‌కి బెస్టాఫ్ లక్. తాప్సీ, రితికకి బెస్టాఫ్ లక్. నేను తప్పకుండా సినిమా చూస్తాను" అని చెప్పారు.
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ "వెన్నెలకిశోర్ ప్రోమో కూడా చూశా. మంచి థ్రిల్లర్. మంచి సీట్ ఎడ్జిలో నవ్విస్తారని కూడా అర్థమవుతోంది. కోనగారికి రైటర్‌గా 25 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. కోనగారు కథ విని బాగా జడ్జి చేస్తారు. స్క్రిప్ట్ వర్కవుట్ అవుతుందని ఆయన చెప్పే జడ్జిమెంట్ ఎప్పుడూ బావుంటుంది. దానికి తగ్గట్టు మంచి బడ్జెట్‌లో, మంచి కథతో, మంచి టెక్నీషియన్స్ తో మంచి సినిమాలు చేస్తున్నారు.
ఆయన టేస్ట్ తెలుస్తోంది. ఈ సినిమా కూడా మంచి స్క్రిప్ట్ తో, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. శ్రీరామ్ కెమెరామేన్ విజువల్స్ బావున్నాయి. వెంకట్ ఫైట్స్ ఇంకా బావున్నాయి. రవిరాజా పినిశెట్టిగారు కమర్షియల్ డైరక్టర్. ఆయన సెట్లో కింగ్‌లాగా ఉండేవారు. వాళ్లబ్బాయి ఆది చాలా మంచి సినిమాలు చూజీగా చేస్తున్నాడు. నాకు చాలా ఇష్టం తను . నేను తనకి పెద్ద ఫ్యాన్‌ని. మంచి వాయిస్ తనది.తనకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఆడియో బావుంది" అని తెలిపారు.
బాబీ మాట్లాడుతూ "కోనగారితో కలిసి జై లవకుశ సినిమాకు పనిచేశాం. దాని తర్వాత నేను మరలా స్క్రిప్ట్ పనిలో పడిపోయాను. అంతలోనే కోనగారు ఓ క్వాలిటీ సినిమాను రూపొందించారు. ఇంత మంచి సినిమాను చేయడం మామూలు విషయం కాదు. కోనగారు, ఎంవీవీగారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఆదిగారు, రితిక, తాప్సీ... కేరక్టర్స్ బావుంటేనే సినిమాలు చేసేవారు. ఆది గత సినిమాలన్నీ చూశాం. ఇందులో బ్లైండ్, థ్రిల్లర్‌లాంటి సినిమా చేస్తున్నారు. చిన్న చేజ్ కూడా ఓ ఫైటర్, ఓ కెమెరామేన్ వచ్చి ఆదికి చెప్పాలని ఓ అసిస్టెంట్ డైరక్టర్ అన్నాడు. అంత కీన్‌గా చేస్తున్నారని అర్థమైంది. టెక్నీషియన్లందరికీ ఆల్ ది బెస్ట్. విజువల్స్, ఫైట్స్ బావున్నాయి" అని చెప్పారు.
భాస్కరభట్ల మాట్లాడుతూ "ఇందులో హీరోయిన్ పాత్రని ఎలివేట్ చేసే సాంగ్‌ని రాశాను. అదే రాక్షసీ రాక్షసీ పాట. సినిమా పెద్ద హిట్ కావాలి. ఆదిగారు బ్లైండ్‌గా నమ్మారు ఈకథని. పెద్ద హిట్ కావాలి" అని అన్నారు.
రవి ఎర్నేని మాట్లాడుతూ "సినిమా పెద్ద హిట్ కావాలి. అందరికీ మంచి పేరు రావాలి" అని అన్నారు.
వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ "ఆల్ ది బెస్ట్ అండీ. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి నాకు తెలుసు. కోనగారు పెద్ద రైటర్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ " అని చెప్పారు.
హరినాథ్ మాట్లాడుతూ "ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు, మా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు" అని చెప్పారు.
తులసి మాట్లాడుతూ "ఈ ముగ్గురు పిల్లలు చాలా బాగా చేశారు. తప్పకుండా పెద్ద హిట్ కావాలి" అని చెప్పారు.
రితిక మాట్లాడుతూ "మా సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులే ఉంది. అందరూ థియేటర్లలో సినిమా చూడండి" అని అన్నారు.
తాప్సీ మాట్లాడుతూ "నిన్నటి నుంచి ప్రమోషన్లలో చెప్పి చెప్పి ఉన్నా. మా సినిమా గురించి చాలా మాట్లాడేశాను. శుక్రవారం నుంచి ప్రేక్షకులే బావుందో, బాగలేదో చెబుతారు. నేను చాలా నెర్వస్‌గా, యాంక్షియస్‌గా ఉన్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికీ, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని అన్నారు.
కోన మాట్లాడుతూ "ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. లైబ్రరీ సినిమా అవుతుంది. ప్రతి శాఖకూ లైబ్రరీ సినిమా అవుతుంది. ప్రతి డిపార్ట్ మెంట్ కూడా అంత కష్టపడి చేశారు. ఆర్ట్, కెమెరా, ఎడిటర్, మ్యూజిక్, కాస్ట్యూమ్స్... ప్రతి క్రాఫ్ట్ తమ 100 శాతం డెడికేషన్‌తో ఈ సినిమా చేశారు. అంతటి డెడికేషన్‌తో చేసినప్పుడు నథింగ్ గో రాంగ్. తాప్సీ ఈ సినిమాకు ఓకే చెప్పకపోతే నేను సినిమా చేసేవాడిని కాదు. తన సినిమాల చాయిస్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దానికోసమైనా సినిమా ఆడుతుంది.
ఇప్పటికే మూడు, నాలుగు షోలు అయిపోయాయి. నన్ను ఎవరైనా ఈ జర్నీలో ఏమి సంపాదించుకున్నావు అని అడిగితే ఓ బాబీని, హరీశ్ శంకర్‌ని, గోపీచంద్ మలినేని, గోపీమోహన్‌ని, దశరథ్‌ని సంపాదించుకున్నాను. ఇది నా ఆస్తి. నటీనటుల నమ్మకాన్ని సంపాదించుకున్నా. ఓ స్క్రిప్ట్ తో నేను వెళ్తే నా సెన్సిబిలిటీస్‌ని నమ్మి 90 శాతం సక్సెస్‌లు ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. తాప్సీ, ఆదిని కూడా ప్రత్యేకంగా చెప్పాలి. నా బలం, నా అండ ఎంవీవీగారు. ఆయన నన్ను ఎక్కడా ఆపరు.
ఆయనకు ప్రశ్నించడం తెలియదు. ఆయన జీవితంలో ప్రశ్నలు ఉండవు. ఎప్పుడూ ఓ స్మైల్ తప్ప. ఇది గొప్ప సినిమా అవుతుంది. మా దర్శకుడు హరికి కూడా మైల్ స్టోన్ సినిమా అవుతుంది. ఎడిట్ రూమ్‌లో వేల గంటలు మేం స్పెండ్ చేశాం. మా ప్రదీప్ అందుకు పెద్ద కారణం. ఓ మనిషి 40 రోజులు ఒక రూమ్‌లో పెట్ట తాళం వేశాం. అంత డెడికేటెడ్‌గా ప్రతి టెక్నీషియన్ పనిచేశారు.
దశరథ్, గోపీమోహన్, హేమంత్... ఇంకొంత మంది ఫ్రెండ్స్ ని పిలిచి తొలి షో వేశాం. రామ్‌చరణ్‌గారికి స్పెషల్ థాంక్స్. చిరంజీవిగారి బర్త్ డే అయినా, తనకు షూటింగ్ ఉన్నా.. మమ్మల్ని అక్కడికి పిలిపించి ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ నెల 24 మా జీవితాల్లో గుర్తుండిపోతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు" అని చెప్పారు.
ఎంవీవీ మాట్లాడుతూ "ఈ నెల 24న విడుదల చేస్తాం. సరైనోడు, రంగస్థలం, నిన్నుకోరి కన్నా చాలా ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముగ్గురూ పోటీ పడి చేశారు. కోనగారు ప్రతి సినిమాకూ శ్రద్ధతో పనిచేస్తారు. ఈ సినిమాకు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. హరినాథ్‌గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కెమెరామేన్, మ్యూజిక్ డైరక్టర్ ఇంకా బాగా చేశారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
ఆది మాట్లాడుతూ "తులసిగారిలాంటి వాళ్లు కార్నర్స్ లో ఉండటం వల్లే హీరో, హీరోయిన్లు మధ్యలో ఉంటారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ముందు తాప్సీ గురించి, తర్వాత తులసిగారి గురించే మాట్లాడారు. సినిమా ఎడిటింగ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయం. దాని గురించి అవగాహన కూడా మనకు ఉండదు. తీసిన ఫుటేజ్ మొత్తం ఓ రూమ్‌లో వేస్తే, ఎడిటర్ సినిమాగా రూపుదిద్దుతాడు. ప్రదీప్ ఎడిటర్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదేమో. ఈ సినిమాకు టెక్నీషియన్లు అందరూ ఈ సినిమాకు ఏం కావాలో... అంతకన్నా ఎక్కువగా ఇచ్చారు.
తాప్సీ ఈ సినిమా చేయకపోతే ఈ సినిమాకు అంత వేల్యూ వచ్చి ఉంటుందని నేను అనుకోను. తను చాలా సెన్సిబుల్‌గా సినిమాలు సెలక్ట్ చేస్తారు. తను చాలా బెస్ట్. రితికా కూడా నేషనల్ అవార్డు విన్నర్. వాళ్ల డెడికేషన్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. మేం మా సినిమా గురించి ఎక్కువ చెప్పకూడదు. మేమందరం నిజాయతీగా పనిచేశాం. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.
12 ఏళ్ల క్రితం 'ఒక విచిత్రం' అని ఒక సినిమా ద్వారా వచ్చాను. అందరూ ఆదరించారు. తమిళ్‌లోకి వెళ్లాను. అది ప్లాన్డ్ గా కాదు. మా అమ్మమ్మకి నేను తెలుగులో హీరోగా చేస్తే చూడాలని కోరిక. ఈ సినిమాను ఆమెకు డెడికేట్ చేస్తున్నా" అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments