Komatireddy Venkat Reddy: నేనూ సీఎం అవుతా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. హోరాహోరి ప్రచారంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అన్ని పార్టీలు అధికారం తమదే అంటూ తమదే అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది కాంగ్రెస్ నేతల ప్రకటనలు మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి. అధికారంలోకి వస్తామో లేదో తెలియదు గానీ అప్పుడే సీఎం నేనేంటే నేనంటూ పోటీపడి మరి బహిరంగంగా ప్రకటిస్తున్నారు. తాజాగా భువనగిరి ఎంపీ, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్గొండలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ నుంచి కోమటిరెడ్డి కూడా సీఎం అయ్యే రోజు వస్తుందని.. ఏదో ఒక రోజు తాను కూడా ముఖ్యమంత్రి అవుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడే సీఎం కావాలనే తొందర మాత్రం తనకు లేదంటూ తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి బీఆర్ఎస్ గెలిచిందంటూ ఆరోపించారు. ప్రజలందరూ విచక్షణతో ఆలోచించి ఓటెయ్యాలని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టంచేశారు.
సోమవారం కొండగల్లో నామినేషన్ వేసిన టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా సీఎం పదవి మీద కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ బిడ్డ రాష్ట్రానికే నాయకత్వం వహించే రోజులు త్వరలోనే రానున్నాయని వెల్లడించారు. అంతకుముందు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సీఎంను అవుతానంటూ ప్రకటించారు. ఇలా రోజురోజుకు కాంగ్రెస్ నేతలు తానే సీఎం అవుతా అంటూ ప్రకటనలు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout