‘‘కొమురం భీముడో’’.. ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ సాంగ్ వచ్చేసిందోచ్

  • IndiaGlitz, [Saturday,December 25 2021]

బాహుబలి సిరీస్ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' . సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారిగా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. కపిల్ శర్మ కామెడీ షో, హిందీ బిగ్‌బాస్ ఇలా దేన్నీ వదలకుండా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. మరోవైపు ఇప్పటికే ‘‘ఆర్ఆర్ఆర్’’లో మూడు పాటలను విడుదల చేశారు. అందులో 'నాటు నాటు' పాటలో హీరోలిద్దరూ వేసిన స్టెప్పులకు మాస్ జనాల నుంచి రెస్పాన్స్ లభించింది. ఇక 'జనని...' సాంగ్ సినిమాలో దేశభక్తిని, 'దోస్తీ' సాంగ్ హీరోల మధ్య ఫ్రెండ్‌షిప్‌ని ఎలివేట్ చేసింది.

తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి మరో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. కీరవాణి తనయుడు కాలభైరవ పాడిన 'కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో .. మండాలి కొడుకో..' అంటూ సాగే ఈ పాటను 'రివోల్ట్ ఆఫ్ భీమ్' పేరుతో విడుదల చేశారు. భీమా నినుగన్న నేలతల్లి.. ఊపిరిపోసిన సెట్టుసేమా.. పేరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా.. ఇనబడుతుందా..?' అనే డైలాగ్ తో ఈ సాంగ్ మొదలైంది.

సినిమాలో కొమరం భీమ్ క్యారెక్టర్‌ను వర్ణిస్తూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. ఎం.ఎం. కీరవాణి స్వరపరిచారు. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

More News

కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలుకు కరోనా .. ఆస్పత్రిలో చికిత్స

దేశంలో కరోనా వైరస్ ఎంతోమంది ప్రముఖులను బలి తీసుకుంది.

టాలీవుడ్‌కు కేసీఆర్ శుభవార్త.. తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్‌సిగ్నల్

ఓ వైపు సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ఏపీలో వివాదం కొనసాగుతున్న వేళ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్జీవి "ఆశా"..ఎన్ కౌంటర్'

శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా అకుల,  వెంకట్, శ్రీధర్, ముని,  నవీన్,  కళ్యాణ్,  ప్రవీణ్,  ప్రశాంతి నటీనటులుగా ఆనంద్ చంద్ర  రచన, దర్శకత్వంలో

శ్రీశైలం ఆలయం వద్ద డ్రోన్ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు గుజరాతీయులు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి డ్రోన్‌ కలకలం రేపింది. ఆలయ పుష్కరిణీ వద్ద డ్రోన్‌ ప్రయోగానికి కొందరు యత్నించడంతో ఆలయ భద్రతా సిబ్బంది

ఏపీలోనూ విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. వెలుగులోకి మూడో కేసు, తూర్పుగోదావరిలో కలకలం

దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో అంతకంతకూ విస్తోరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని కేసులు పెరుగుతున్నాయి.