'జీ 5'లో డిసెంబర్ 4న 'కోమాలి' ప్రీమియర్

03 డిసెంబర్, 2020: తెలుగు వీక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్, వెబ్ షోలు అందిస్తున్న ఓటీటీ వేదిక 'జీ 5'. లాక్‌డౌన్‌లో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు... 'అమృతం ద్వితీయం' వెబిసోడ్స్‌తో వీక్షకులను ఎంటర్టైన్ చేశారు. డిసెంబర్ 4న మరో కొత్త సినిమాను తీసుకొస్తున్నారు. తమిళ హీరో 'జయం' రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'కోమాలి' శుక్రవారం 'జీ 5'లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీమియర్ కానుంది.

పదహారేళ్లు కోమాలో ఉన్న ఓ వ్యక్తి మళ్లీ ఈ లోకంలోకి వస్తే? అనే కథాంశంతో 'కోమాలి' రూపొందింది. పదహారేళ్లకు, ఇప్పటికి సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. మారిన పరిస్థితులకు కథానాయకుడు అలవాటు పడ్డాడా? పదహారేళ్ల క్రితం సమాజంలో ఉన్న కథానాయకుడు చేసే పనులు ఏమిటి? అనేది ఆసక్తికరం. ఇదొక వినోదాత్మక చిత్రమని 'జీ 5' వర్గాలు తెలియజేశాయి.

'జయం' రవి కథానాయకుడిగా, కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సంయుక్తా హెగ్డే సెకండ్ హీరోయిన్. స్కూల్ డేస్ లో హీరోని ప్రేమించిన అమ్మాయిగా, హీరో కోమా నుండి తిరిగొచ్చే సమయానికి మరొకరిని పెళ్లి చేసుకున్న మహిళగా కనిపిస్తారు. కమెడియన్ యోగిబాబు, హీరో జయం రవి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. ఎమ్మెల్యేగా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'హిప్ హాప్' తమిళ సంగీత దర్శకుడు.

More News

క్లాస్ రూమ్‌లో మైనర్ విద్యార్థుల పెళ్లి.. లైక్స్ కోసమేనట...

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థుల పెళ్లి కలకలం సృష్టించింది.

తలైవా ఎంట్రీ ఫిక్స్.. జనవరిలో పార్టీ లాంచ్

తమిళ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది రోజుల్లో రాబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు?

నా ట్విట్టర్, ఇన్‌స్టా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి: వరలక్ష్మి శరత్‌కుమార్

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

దుల్కర్‌తో సినిమా.. భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసిన పూజా హెగ్డే..

అనతి కాలంలో స్టార్ హీరోయిన్ల జాబితాలో ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే.

చివరి గంటే కీలకం..

జీహెచ్ఎంసీ పోలింగ్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. దాదాపు ఏ ఎన్నికల్లో అయినా 12 గంటల లోపు ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుంది.