‘సారంగదరియా’ గురించి ‘రేలారే రేలా’లో పాడిన కోమల ఏం చెప్పిందంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పాట ‘సారంగదరియా’. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటకు లక్షల్లో లైక్స్.. కోట్లలో వ్యూస్ వచ్చాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాలోనిదే ఈ పాట. అయితే... ‘లవ్ స్టోరీ’ సినిమా నుంచి విడుదలై ఇంతలా ఆకట్టుకుంటున్న ఈ ‘సారంగ దరియా’ పాటను ఆలపించింది మంగ్లీనే అయినా.. ఈ జానపద పాట గతంలోనే ఎంతోమంది జానపద కళాకారులు ఆలపించారు. ఆ తరువాత టిక్‌టాక్ ద్వారా మరింత ఫేమస్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది మనసులను ఇప్పుడు కొల్లగొట్టిన ఈ ‘సారంగ దరియా’ పాట వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాట రాసిన సుద్దాల అశోక్ తేజపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి.
ఈ పాట తొలుత 2010లో ‘రేలా రే రేలా’ అనే జానపద పాటల కార్యక్రమంలో వెలుగు చూసింది. ఆ ప్రోగ్రాంలో ‘సారంగ దరియా’ పాటను పాడిన జానపద గాయని పేరు కోమల. అప్పట్లో ఈమె పాడిన ఈ పాట ఎన్నో హృదయాలను గెలుచుకుంది. అయితే ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతల్లో ఒకరుగా సుద్దాల వ్యవహరించారని.. ఇన్నాళ్లకు ఆ పాటను పదాలు మార్చి యాజ్ ఇటీజ్‌గా ఈ సినిమా కోసం అందించారు. అయితే ఈ పాట గురించి కోమల ఆసక్తికర విషయాలను తాజాగా వెల్లడించింది. 2008లో తొలిసారిగా.. తన అమ్మమ్మ ఈ పాట పాడుతుండగా విన్నానని ఆమె చెప్పింది. ఆ తర్వాత.. చాలాచోట్ల పొలాల్లో పనికెళ్లిన కొందరు మహిళలు పాడగా విన్నానని తెలిపింది.
ఈ పాటకున్న అర్థాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక గడుసు పిల్ల మనసు గెలుచుకోవడం అంత సులభం కాదని చెప్పడమని కోమల వెల్లడించింది.ఈ పాట అర్థాన్ని తెలుసుకున్న తర్వాత తాను కూడా ఈ పాటను పాడాలని నిర్ణయించుకున్నానని, తనకు ‘రేలారే రేలా’ ద్వారా ఆ అవకాశం దక్కిందని ఆమె చెప్పింది. ఈ పాటకు లిరిక్స్ అందించిన సుద్దాల అశోక్ తేజ ముందే ఈ పాటను కోమల పాడటం విశేషం. అయితే ఈ పాటకు మంచి ఆదరణ కల్పిస్తానని అప్పుడే కోమలకు సుద్దాల మాటిచ్చారట. ఇన్నాళ్లకు ఆ మాటను నిలబెట్టుకున్నారు. అయితే నిజానికి ఈ పాటను కోమలే పాడాల్సి ఉందట. కానీ అనారోగ్య కారణాల రీత్యా తిరస్కరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout