కోలీవుడ్ X టాలీవుడ్.. సిద్దార్థ్ కామెంట్స్ వైరల్!
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియాలో కోలీవుడ్ అభిమానులు, టాలీవుడ్ అభిమానుల మధ్య ఫైట్ తారాస్థాయికి చేరుతోంది. నారప్ప చిత్రం అమెజాన్ లో విడుదలైనప్పటి నుంచి ఈ వార్ మొదలైంది. కొందరు కోలీవుడ్ అభిమానులు ఒరిజినల్ వర్షన్ అసురన్ తో పోల్చుకుంటే నారప్ప ఏమాత్రం బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు. దీనికి టాలీవుడ్ అభిమానులు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు.
ఈ వివాదం సోషల్ మీడియాలో కోలీవుడ్ వెర్సస్ టాలీవుడ్ గా మారింది. దీనిపై హీరో సిద్దార్థ్ ట్విట్టర్ లో సెటైరికల్ గా స్పందించాడు. 'కొందరు మేధావుల మధ్య టాలీవుడ్ వెర్సస్ కోలీవుడ్ ఫైట్ జరుగుతోంది. ఇది చూశాక నాకు చిన్న ఆలోచన వచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఇటీవల వింధ్య పర్వతాలకు దిగువన ఉన్న అన్ని భాషల్ని కలిపేస్తూ నెట్ ఫ్లిక్స్ సౌత్ అనే కేటగిరి తీసుకువచ్చింది. ముందు అది మార్చండి. ప్రతి భాషకు ప్రాధాన్యత ఇచ్చేలా అన్ని భాషలకు కేటగిరీలు ఉండాలి. సినిమాల్లో హిందీ పరిశ్రమ పెద్దది అనే భావన మారాలి.దానిని మార్చండి' అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు.
ప్రతి ఒక్కరూ హిందీ పరిశ్రమే పెద్దది అనే భావనతో ఉన్నారని.. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత దక్కడం లేదనేది సిద్దార్థ్ అభిప్రాయం. ముందు దాని గురించి ఆలోచించకుండా టాలీవుడ్, కోలీవుడ్ అంటూ కొట్టుకోవడం ఏంటని సిద్దార్థ్ పరోక్షంగా అభిమానులకు చురకలంటించారు.
మరి కొందరు అభిమానులైతే టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ స్టార్ డం ఉన్న పవన్ కళ్యాణ్, విజయ్ లని పోల్చుతూ కామెంట్స్ చేసుకుంటున్నారు. నారప్పలో వెంకటేష్ కంటే అసురన్ లో ధనుష్ అద్భుతంగా నటించాడని కోలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. వెంకటేష్ నటన అద్భుతంగా ఉందనేది టాలీవుడ్ అభిమానుల వాదన. ఈ క్రమంలో కొందరు తెలుగు నుంచి తమిళ్ లోకి రీమేక్ అయినా చిత్రాలని ప్రస్తావిస్తున్నారు. మహేష్ బాబు పోకిరి చిత్రాన్ని తమిళ్ లో చెడగొట్టారు అని టాలీవుడ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
For geniuses fighting #Tollywood Vs #Kollywood on twitter today, a small thought.
— Siddharth (@Actor_Siddharth) July 21, 2021
Netflix has clubbed all industries below the Vindhyas as @Netflix_INSouth
Let's first change that. Each language must be given its own place. This Hindi > South narrative must change. Change it.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments