చరణ్ సినిమా లో మరో తమిళ సంగీత దర్శకుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
రాంచరణ్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమిళంలో విజయవంతమైన తనీఒరువన్` సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకు రక్షక్` అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని వార్తలు వినపడ్డాయి. వచ్చే నెల నుండి సినిమా చిత్రీకరణ స్టార్టవుతుందట. ఈ సినిమాలో విలన్‌గా అరవింద్ స్వామి నటిస్తున్నాడు. హీరోయిన్గా శృతిహాసన్, కీర్తి సురేష్ పేర్లు వినడుతున్నాయి.
అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడట. ఈ విషయాన్ని కథకళి` ప్రెస్మీట్లో సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ తెలియజేశాడు. త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్టవుతుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com