చ‌ర‌ణ్ సినిమా లో మరో తమిళ సంగీత ద‌ర్శ‌కుడు...

  • IndiaGlitz, [Wednesday,January 20 2016]

రాంచ‌ర‌ణ్ హీరోగా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో విజ‌య‌వంత‌మైన తనీఒరువ‌న్' సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఈ సినిమాకు ర‌క్ష‌క్' అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. వ‌చ్చే నెల నుండి సినిమా చిత్రీక‌ర‌ణ స్టార్ట‌వుతుంద‌ట‌. ఈ సినిమాలో విల‌న్‌గా అర‌వింద్ స్వామి న‌టిస్తున్నాడు. హీరోయిన్‌గా శృతిహాస‌న్‌, కీర్తి సురేష్ పేర్లు విన‌డుతున్నాయి.

అయితే లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ చిత్రానికి త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని క‌థ‌క‌ళి' ప్రెస్‌మీట్‌లో సంగీత ద‌ర్శ‌కుడు హిప్ హాప్ త‌మిళ తెలియ‌జేశాడు. త్వ‌ర‌లోనే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట‌వుతుంద‌ని స‌మాచారం.