Vishal:లక్ష్మీ మీనన్‌తో పెళ్లి.. అంతా అవాస్తవం, ఒక ఆడపిల్ల జీవితంలోకి చొరబొడొద్దు : విశాల్ సీరియస్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పెళ్లి కానీ హీరో హీరోయిన్లంతా పెళ్లిపీటలెక్కుతున్నారు. కొందరు తమ కో స్టార్స్‌ను పెళ్లి చేసుకుంటుంటే.. ఇంకొందరేమో పెద్దలు చేసిన పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఎటూ తేల్చకుండా ముదురు బెండకాయ మాదిరిగా తయారవుతున్నారు. ఈ లాస్ట్ కేటగిరీకే చెందుతారు కోలీవుడ్ హీరో విశాల్. పక్కా తెలుగు కుర్రాడైన విశాల్ తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగారు. తమిళంలో తను చేసిన సినిమాలను తెలుగులోకి డబ్ చేసి ఇక్కడా మంచి మార్కెట్ సాధించాడు. పందెం కోడి, అభిమన్యుడు, భరణి, ఇంద్రుడు, పొగరు, డిటెక్టివ్ వంటి చిత్రాలు తెలుగువారిని అలరించాయి.
లక్ష్మీమీనన్‌తో విశాల్ పెళ్లంటూ సోషల్ మీడియాలో వార్తలు :
అయితే 40 ప్లస్‌లో వున్న విశాల్ అవివాహితుడు. కొందరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన ఇతను.. వరలక్ష్మీ శరత్ కుమార్‌తో మాత్రం పెళ్లి వరకు వెళ్లాడు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లతో విశాల్ పెళ్లి జరగబోతోందని మీడియాలో గాసిప్స్ వచ్చాయి. తాజాగా యువ నటి లక్ష్మీ మీనన్‌ను విశాల్ పెళ్లాడబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ న్యూస్ కాస్తా వైరల్ కావడంతో విశాల్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు.
నా పెళ్లేమైనా బెర్ముడా ట్రయాంగిల్ అంత క్లిష్టమైనది కాదు :
సాధారణంగా తాను తన గురించి వచ్చే ఫేక్ న్యూస్‌కి, రూమర్స్‌కి ఆన్సర్ ఇవ్వననని.. అది తన దృష్టిలో అనవసరమన్నారు. కానీ ఇప్పుడు లక్ష్మీమీనన్‌తో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించాల్సి వస్తుంది. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని, అలాగే నిరాధారమని ఆమె పేర్కొన్నారు. దీనిపై తాను స్పందించడానికి కారణం ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి. ఆమె ఒక నటి అనే సంగతి పక్కనబెడితే.. ఇలాంటి వార్తలతో ఒక అమ్మాయి జీవితంలోకి చొరబడుతున్నారని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పేరును నాశనం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తాను ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ వివాహం చేసుకుంటానో తెలుసుకోవడం బెర్ముడా ట్రయాంగిల్ అంత క్లిష్టమైనదేది కాదన్నారు. టైం వచ్చినప్పుడు పెళ్లి గురించి తానే అధికారికంగా ప్రకటిస్తానని విశాల్ స్పష్టం చేశారు.
Usually I don’t respond to any fake news or rumors about me coz I feel it’s useless. But now since the rumour about my marriage with Laksmi Menon is doing the rounds, I point blankly deny this and it’s absolutely not true and baseless.
— Vishal (@VishalKOfficial) August 11, 2023
The reason behind my response is only…
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com