ఆసుపత్రిలో చేరిన తమిళ హీరో శింబు.. కరోనా అంటూ ప్రచారం, క్లారిటీ ఇచ్చిన సన్నిహితులు

  • IndiaGlitz, [Saturday,December 11 2021]

తమిళ యువనటుడు శింబు అనారోగ్యంతో చెన్నయ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. దాంతో ఆయనకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. గొంతు నొప్పి, జ్వరంతో శింబు హాస్పిటల్‌లో చేరాడని, అతనికి కరోనా రాలేదని సన్నిహితులు స్పష్టం చేశారు. శింబు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం శింబు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ ఇప్పటికే ముంబైలో పూర్తయ్యింది. తాజా షెడ్యూల్ చెన్నయ్‌లో జరుగుతోంది. శింబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులూ , సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

కాగా.. శింబు నటించిన తాజా చిత్రం ‘మానాడు’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ దర్శకుడు ఎస్‌. జే. సూర్య విలన్‌గా చేశారు. ‘టైమ్‌ లూప్‌’ అనే ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల తమిళనాడులో విడుదలై ఘన విజయం సాధించింది. గత కొన్నేళ్లుగా హిట్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోన్న శింబుకు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది.

More News

బిబిసి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ భాగ‌స్వామ్యంతో జీ5 నిర్మిస్తున్న వెబ్ సిరీస్ 'గాలివాన‌'

'జీ 5'... ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి! ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది.

శ్యామ్ సింగ రాయ్ ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ - నిర్మాత వెంకట్ బోయనపల్లి

న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని  నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ‘‘ఔను సిరిని కంట్రోల్ చేస్తున్నా’’.. హౌస్‌మేట్స్‌ ముందు ఒప్పుకున్న షన్నూ

బిగ్‌బాస్ 5 తెలుగులో ప్రేక్షకులను ఓట్లు అడిగే టాస్క్ కొనసాగుతోంది. హౌస్‌మేట్స్ తమ పర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు.

హెలికాఫ్టర్ ప్రమాదం: సాయితేజ మృతదేహం గుర్తింపులో జాప్యం.. ఆధారమైన ‘‘పచ్చబొట్టు’’

తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది సైనిక సిబ్బంది

సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్

తమిళనాడులో నీలగిరి కొండల్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్‌నాయక్‌ సాయితేజ్‌ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి