ఆసుపత్రిలో చేరిన తమిళ హీరో శింబు.. కరోనా అంటూ ప్రచారం, క్లారిటీ ఇచ్చిన సన్నిహితులు
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ యువనటుడు శింబు అనారోగ్యంతో చెన్నయ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. దాంతో ఆయనకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. గొంతు నొప్పి, జ్వరంతో శింబు హాస్పిటల్లో చేరాడని, అతనికి కరోనా రాలేదని సన్నిహితులు స్పష్టం చేశారు. శింబు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం శింబు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ ఇప్పటికే ముంబైలో పూర్తయ్యింది. తాజా షెడ్యూల్ చెన్నయ్‌లో జరుగుతోంది. శింబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులూ , సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.
కాగా.. శింబు నటించిన తాజా చిత్రం ‘మానాడు’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించగా, ప్రముఖ దర్శకుడు ఎస్. జే. సూర్య విలన్‌గా చేశారు. ‘టైమ్ లూప్’ అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల తమిళనాడులో విడుదలై ఘన విజయం సాధించింది. గత కొన్నేళ్లుగా హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోన్న శింబుకు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com