కోలీవుడ్ కెప్టెన్ రాజీనామా
- IndiaGlitz, [Friday,January 22 2016]
తారల క్రికెట్‌కు ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అందరూ తారలు కలిసి క్రికెట్ ఆడుతున్నారు. వీరందరిలో కోలీవుడ్ సిసిఎల్‌లో రాజకీయాలు ఎక్కువగా రాజుకుంటుంది. వివరాల్లోకి వెళితే నడిగర్ సంఘం ఎన్నికలకు ముందు చెన్నై రైనోస్ టీం కెప్టెన్‌గా వ్యవహరించిన విశాల్ పదవికి రాజీనామా చేశాడు. జీవా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు జీవా కూడా కెప్టెన్సీకి రాజీనామా చేశాడట. ఇప్పుడు ఆర్య కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.