కరోనాతో కోలీవుడ్ నటుడు నితీశ్ వీరా మృతి

  • IndiaGlitz, [Monday,May 17 2021]

కరోనా మహమ్మారి కారణంగా ఎంతమంది ప్రజలు మృత్యువాత పడుతున్నారో తెలియనిది కాదు. సెకండ్ వేవ్‌లో పెద్ద ఎత్తున కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‌లో లక్షల్లో ప్రజలు కరోనా బారిన పడుతుండగా.. వేలల్లో కరోనాతో మరణిస్తున్నారు. భారత్‌లో ఎక్కడ చూసినా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. శ్మశానాల్లో సైతం హౌస్‌ ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

Also Read: ఈ లక్షణాలున్నాయా? అయితే కరోనాగా అనుమానించాల్సిందే..

ఇటీవల ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నట్టు కరోనా మహమ్మారి కారణంగా ఎవరెప్పుడు పోతారో తెలియకుండా పోతోంది. సినీ రంగానికి సంబంధించిన కొంద‌రు సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా కన్నుమూశారు. మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు వారి కుటుంబ స‌భ్యుల్ని, స‌న్నిహితుల‌ను కోల్పోయారు. క‌రోనా కార‌ణంగా, కోలీవుడ్ చిత్ర సీమ‌కు చెందిన అప్ క‌మింగ్ యాక్ట‌ర్ నితీశ్ వీరా(45) నేడు (సోమవారం) కన్నుమూశారు. పేర‌రుసు, వెన్నిల క‌బ‌డి కుళు, పుదు పేట్టై, అసుర‌న్ చిత్రాల్లో నితీశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నితీశ్ వీరా మృతిపై కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More News

ఈ లక్షణాలున్నాయా? అయితే కరోనాగా అనుమానించాల్సిందే..

దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొవిడ్‌తో పాటు దాని లక్షణాలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

బ్లాక్ ఫంగస్ రాకుండా చూడాలంటే ఇలా చేయండి..

దేశాన్ని ఒకవైపు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) ప్రజల ప్రాణాలను తీసేస్తోంది.

అద్భుతం.. మహా శివుడిని క్లిక్ మనిపించిన దేవిశ్రీ

ఆకాశంలో ఆధ్యాత్మిక అద్భుతం చోటు చేసుకుంది. అది రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంట పడింది. ఇంకేముంది వెంటనే తన కెమెరాలో ఆ అద్భుత దృశ్యాన్ని బంధించి అభిమానులతో పంచుకున్నాడు.

మరో డేరింగ్ స్టెప్.. హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్

మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం ఉప్పెనతోనే ప్రతిభగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి చిత్రంగా ఉప్పెన లాంటి కథ ఎంచుకోవడం డేరింగ్ స్టెప్పే అని చెప్పాలి.

తెలంగాణలో కొవాగ్జిన్ రెండో డోసు బంద్...

తెలంగాణలో కొవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. తగినంత నిల్వ లేకపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొత్తగా స్టాక్‌ రానందున