ఇన్స్టాలో రిచ్ వీరే: ప్రియాంకని బీట్ చేసిన కోహ్లీ.. ఒక్కో పోస్ట్ కి అన్ని కోట్లా!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం రోజుల్లో సోషల్ మీడియా పవర్ ఫుల్ మీడియంగా మారిపోయింది. సాధారణ మీడియా కంటే జనాలు ఎక్కువగా సోషల్ మీడియానే ఇష్టపడుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లకు ధీటుగా ఇన్స్టాగ్రామ్ కు ఆదరణ ఉంది. ముఖ్యంగా సెలెబ్రిటీలు ఇన్స్టాగ్రామ్ ని బాగా ఇష్టపడుతున్నారు.
ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు, వీడియోలు ఎక్కువగా హైలైట్ అవుతాయి. సెలబ్రిటీలకు కావాల్సింది కూడా అదే. దీనితో తమని తాము ప్రమోట్ చేసుకునేందుకు, అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు సౌలభ్యంగా ఉండడంతో సెలెబ్రిటీలు, వారిని ఫాలో అవుతూ అభిమానులు ఇన్స్టా ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా రావడంలో తప్పు లేదు.. దిశా, అలియాతో గొంతు కలిపిన రష్మీ
ఇన్స్టాగ్రామ్ కి ఉన్న క్రేజ్ తో ఇందులో పైడ్ ప్రమోషన్స్ కి కూడా బాగా డిమాండ్ పెరిగింది. తాజాగా 2021 రిచెస్ట్ ఇన్స్టాగ్రామ్ సెలెబ్రిటీల జాబితా విడుదలయింది. ఫాలోవర్స్ సంఖ్య, ఒక్కో పోస్ట్ కి వారు సంపాదించే మొత్తం ఆధారంగా ఈ జాబితా విడుదలైంది.
ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో 308 మిలియన్ ఫాలోవర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఒక్కో పోస్ట్ కి అతడు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే దిమ్మతిరిపోద్ది. రోనాల్డో ఒక్క పోస్ట్ కి దాదాపు రూ 12 కోట్లు ఛార్జ్ చేస్తాడు. ప్రముఖ హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ అలియాజ్ ది రాక్ 250 మిలియన్ ఫాలోవర్స్ తో రెండవస్థానంలో కొనసాగుతున్నారు. రాక్ ఒక్కో పోస్ట్ కి 11 కోట్ల వరకు సంపాదిస్తాడు. సెలెబ్రిటీలు ఒక్కో పోస్ట్ కి సంపాదించే మొత్తం ఆధారంగా టాప్ 10 జాబితాని పరిశీలిద్దాం..
1. క్రిస్టియానో రోనాల్డో - 12 కోట్లు(రూపాయలు పర్ పోస్ట్)
2. డ్వేన్ జాన్సన్ (రాక్)- 11.3 కోట్లు
3. అరియనా గ్రాండే -11.2 కోట్లు
4. కైలీ జెన్నర్ - 11.1 కోట్లు
5. సెలెనా గోమెజ్ - 10.9 కోట్లు
6. కిమ్ కర్దాషియన్ - 10.5 కోట్లు
7. లియోనెల్ మెస్సి - 8.6 కోట్లు
8. బయన్సీ నోలెస్ - 8.5 కోట్లు
9. జస్టిన్ బీబర్ - 8.2 కోట్లు
10. కెందాల్ జెన్నర్ - 7.4 కోట్లు
ఇక టాప్ 30 లో కేవలం ఇద్దరు ఇండియన్లకు మాత్రమే చోటు దక్కింది. ఇన్స్టాగ్రామ్లో టాప్ రిచెస్ట్ ఇండియన్లు విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా మాత్రమే ఉన్నారు. వ్విరాట్ కోహ్లీ 19వ స్థానం దక్కించుకోగా ప్రియాంక చోప్రా 27వ స్థానంతో సరిపెట్టుకుంది.
గత ఏడాది 23వస్థానం దక్కించుకున్న టీం ఇండియా కెప్టెన్ ఈ ఏడాది 19 వ స్థానానికి ఎగబాకాడు. ఇన్స్టాలో విరాట్ కి 125 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కో పోస్ట్ కి సంపాదన విషయంలో కూడా విరాట్.. ప్రియాంకని బీట్ చేశాడు. ఒక్కో పోస్ట్ కి ప్రియాంక రూ 3 కోట్ల వరకు సంపాదిస్తుంది. కానీ విరాట్ కోహ్లీ ఒక్క పోస్ట్ కి ఏకంగా 5 కోట్ల వరకు ఆదాయం అందుకుంటున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout