Kodikatthi Srinu :ఎట్టకేలకు కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు
Send us your feedback to audioarticles@vaarta.com
2019 ఎన్నికలకు ముందు ఏపీలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. అతడికి షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని.. కేసు గురించి ఎక్కడా మీడియాతో మాట్లాడవద్దని సూచించింది.
కోడికత్తి కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుకాకపోవడంతో గత ఐదేళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ జైలులోనే దీక్ష చేశాడు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు చికిత్స అందించారు. మరోవైపు శ్రీను తల్లి, సోదరుడు సైతం నిరాహార దీక్ష చేశారు. మొత్తానికి వారి ఎదురుచూపులు ఫలించాయి. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో దళిత సంఘాలు, కుటుంబ సభ్యులు హర్షం చేస్తున్నారు.
కాగా 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై కోడికత్తి దాడి జరిగిన సంగి తెలిసిందే. ఈ దాడి కేసులో శ్రీనివాస్‌ను పోలీసుల అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కొద్దిరోజుల క్రితం న్యాయస్థానం విచారణ చేపట్టింది.
విచారణలో భాగంగా సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీని వల్ల నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని.. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇన్నేళ్లు జైల్లో ఉండటం సరికాదని తెలిపారు. వాదనలు విన్న కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com