Kodikatthi Srinu :ఎట్టకేలకు కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు

  • IndiaGlitz, [Thursday,February 08 2024]

2019 ఎన్నికలకు ముందు ఏపీలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. అతడికి షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని.. కేసు గురించి ఎక్కడా మీడియాతో మాట్లాడవద్దని సూచించింది.

కోడికత్తి కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుకాకపోవడంతో గత ఐదేళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ జైలులోనే దీక్ష చేశాడు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు చికిత్స అందించారు. మరోవైపు శ్రీను తల్లి, సోదరుడు సైతం నిరాహార దీక్ష చేశారు. మొత్తానికి వారి ఎదురుచూపులు ఫలించాయి. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో దళిత సంఘాలు, కుటుంబ సభ్యులు హర్షం చేస్తున్నారు.

కాగా 2018 అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై కోడికత్తి దాడి జరిగిన సంగి తెలిసిందే. ఈ దాడి కేసులో శ్రీనివాస్‌ను పోలీసుల అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కొద్దిరోజుల క్రితం న్యాయస్థానం విచారణ చేపట్టింది.

విచారణలో భాగంగా సీఎం జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. దీని వల్ల నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని.. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇన్నేళ్లు జైల్లో ఉండటం సరికాదని తెలిపారు. వాదనలు విన్న కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

More News

Governor:తమది ప్రజా ప్రభుత్వం.. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.

Chandrababu:అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ.. ఎన్డీఏలోకి ఆహ్వానం..

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరూ పొత్తులో కలుస్తారో అర్థం కాని పరిస్థితి.

Sharmila :తన చెడు కోరుకుంటున్నారా..? సీఎం జగన్‌ టార్గెట్‌గా షర్మిల విమర్శలు..

తన భద్రతపై సీఎం జగన్‌ టార్గె్‌ట్‌గా మరోసారి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

Lal Salaam:ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే.. రజినీకాంత్ డైలాగ్ అదిరింది..

మొయిద్దీన్ భాయ్ పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'లాల్ సలామ్'(LAL SALAAM) తెలుగు ట్రైలర్‌ మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

Family Star:రౌడీ హీరో 'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసిందిగా.. వినేయండి..

రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. తనకు 'గీత గోవిందం' లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో