ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

  • IndiaGlitz, [Friday,February 22 2019]

టాలీవుడ్ సీనియర్ దర్శకులు, హిట్ సినిమాల కేరాఫ్‌‌గా పేరుగాంచిన కోడి రామకృష్ణ తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం కోడి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు, మిత్రులు హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. నిన్నటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. కోడి ఇకలేరని తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.

గతంలో పెరలాసిస్ భారిన పడిన చికిత్స తీసుకుని త్వరగానే కోలుకున్నారు. అయితే ఈసారి కూడా ఆయన ఆరోగ్యం కుదుటపడి మళ్లీ మన మధ్యలోకి వస్తారని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా శనివారం మధ్యాహ్నం కోడి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

బాల్యం..
కోడి రామకృష్ణ స్వస్థలం పాలకొల్లు. ఆయన తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టెమ్మ. ఆయన ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకూ మొత్తం పాలకొల్లులోనే సాగింది. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే చిత్రకళ వృత్తిని చేపట్టారు. పగలు చదువుకోవడంతోపాటు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్స్ షాపును రాత్రిళ్ళు నిర్వహించేవారు. ఆయన చిత్రాలు గురువు నాగేశ్వరరావుతో ఫొటోలు తీయించుకుని నటునిగా అవకాశం కోసం పలువురు దర్శకులకు పంపేవారు.

1982 లో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో టాలీవుడ్‌కు డైరెక్టర్‌గా పరిచయమైన కోడి రామకృష్ణ మొదటి సినిమా తన సత్తా ఏంటో చాటి చెప్పారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో విజయవంతమై కోడికి మంచి పేరుతెచ్చిపెట్టాయి. ముఖ్యంగా టాలీవుడ్‌‌కు వీఎఫ్ఎక్స్ పరిచయం చేసిన ఘనత కోడిదే. ‘అమ్మోరు’, ‘అరుంధతి’, చిత్రాలు ఏ రేంజ్‌‌లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!. తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ కోడి రామకృష్ణ తెరకెక్కించిన కొన్ని సినిమాలు సూపర్ డూపర్‌ హిట్టయ్యాయి.‌

More News

శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసిందోచ్..

టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కస్టమర్స్‌ కోసం సరికొత్త మోడల్స్‌‌ను శామ్‌సంగ్ రిలీజ్ చేస్తున్న విషయం విదితమే. దక్షిణ కొరియాకు చెందిన ఈ ప్రముఖ మల్టీనేషనల్ కమ్యూనికేషన్

మార్చి 8న తెలుగు, త‌మిళ భాష‌ల్లో 'బొట్టు' విడుద‌ల‌

`ప్రేమిస్తే` ఫేమ్ భ‌ర‌త్‌, న‌మిత, ఇనియా, ఊర్వ‌శి, ష‌కీలా ప్ర‌ధాన తారాగ‌ణంగా వి.సి.వ‌డివుడ‌యాన్ ద‌ర్శ‌క‌త్వంలో

తెలంగాణ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌..

తెలంగాణలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ‘ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌’ను ప్రవేశపెట్టారు.

'15-18-24 లవ్ స్టోరీ' టైటిల్ లోగో ఆవిష్క‌ర‌ణ‌

15 వ‌య‌సు.. 18 వ‌య‌సు.. 24 వ‌య‌సు.. ఈ మూడు ద‌శ‌ల్లో ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమ‌ల్లో గ‌మ్మ‌త్త‌యిన సంగ‌తులేంటి?

ఒక్కో అమరవీరుడి కుటుంబానికి 25 లక్షలు: కేసీఆర్

పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 42 మంది సీఆర్ఫీఎప్ కుటుంబాలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకొచ్చారు.