టీడీపీ నేతలకు భయం పట్టుకుంది..: కొడాలి నాని
Send us your feedback to audioarticles@vaarta.com
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు అంతా అయిపోయింది.. జగన్ సర్కార్‌కు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయని గట్టిగా మీడియా ముందుకు పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. అయితే టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు. ‘చంద్రబాబు బంధువు, దేవినేని ఉమ కమీషన్దారు అయిన కాంట్రాక్టర్‌కు అనుకూలంగా తీర్చు వచ్చింది అని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. పోలవరం కాంట్రాక్టులో అవినీతి జరిగింది.. నిబంధనలను అతిక్రమించి చంద్రబాబు తన బంధువులకు, బినామీలకు అప్పగించారు. చంద్రబాబు చర్యలతో ప్రభుత్వానికి పెద్దఎత్తున నష్టం జరిగింది. ప్రభుత్వానికి డబ్బులు మిగలాలన్న ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు.
కాంట్రాక్టు మారితే...!
‘అయితే.. దీని ద్వారా తనకు నష్టం జరుగుతుందని, రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఆపాలను కోరుతూ న్యాయస్థానాన్ని కాంట్రాక్టరు ఆశ్రయించారు. తీర్పు చెప్పే వరకు ఈ ప్రక్రియను తాత్కాలికంగా ఆపాలని హైకోర్టు ఆదేశించిందే తప్ప, చంద్రబాబు చుట్టాలకు పనులు అప్పగించాలని చెప్పలేదు. కాంట్రాక్టు మారితే డబ్బులు వెనక్కి ఇవ్వాలన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుంది. ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని చంద్రబాబు, దేవినేని ఉమ ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని కాపాడే క్రమంలో ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఏర్పడినా ముందుకే వెళతాం తప్ప, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు" అని టీడీపీ నేతలకు మంత్రి కొడాలి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
బాబుకు భయం పట్టుకుంది!
ఈ వ్యవహారంపై నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. "రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి బయటకు వస్తాయని చంద్రబాబుకు భయం పట్టుకుంది. పోలవరం ప్రాజెక్ట్ ఆపేస్తున్నట్లు టీడీపీ హడావుడి చేస్తోంది. యధావిథిగా రివర్స్ టెండిరింగ్‌కు వెళ్లవచ్చనిఏది ఏమైనా కోర్టు తీర్పును గౌరవిస్తాం. ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటాం. ఇక వరదల్లో ఒక్క తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. వరదలను కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని, వరదల్లో ఒక్క గండి పడలేదని, ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాం" అని అనిల్ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout