Kodali Nani: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌పై కొడాలి నాని హాట్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేశ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. బోరా గాళ్లంతా మొదలెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరని కొడాలి వెల్లడించారు. అడుగు ఊడిపోయిన బక్కెట్ గాళ్లంతా విజయనగరంలో చేసింది పిల్లి మెడలో గంటకట్టే ప్రయత్నమే అని ఎద్దేవా చేశారు. 2009 సెప్టెంబర్ 2వ తేదినే తమ అధినేత జగన్ యుద్ధం మొదలు పెట్టారని తెలిపారు. 12ఏళ్ల క్రితం యుద్ధభేరి మోగించిన జగన్.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీనే కూకటివేళ్లతో పెకలించేశారని పేర్కొన్నారు.
అలాగే చంద్రబాబును భూస్థాపితం చేసి.. పవన్ కళ్యాణ్‌ను రెండుచోట్ల చిత్తు చేస్తూ మంగళగిరిలో లోకేశ్‌కు సమాధి కట్టారంటూ వ్యాఖ్యానించారు. పవన్, లోకేశ్, చంద్రబాబు ఇప్పుడు గంటలు మోగిస్తూ యుద్ధభేరి మెదలెట్టినా జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా మాట్లాడుతూ 30ఏళ్ల క్రితమే చంద్రగిరి నుంచి కుప్పం ట్రాన్స్ఫర్ అయ్యారని గుర్తు చేశారు. లోకేశ్ పుట్టింది మంగళగిరిలోనా..? పవన్ కల్యాణ్.. భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకున్నారా? అంటూ ప్రశ్నించారు. తండ్రి, కొడుకు, వాళ్ల పార్ట్నర్ ముగ్గురూ వలస వెళ్లిన వాళ్లేనని సెటైర్లు వేశారు.
కాగా బుధవారం రాత్రి విజయనగరంలో జరిగిన యువగళం నవశకం బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ సీఎం జగన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి జగన్‌తో పాటు వైసీపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. తమ కలయిక చూసి జగన్‌కు వెన్నులో వణుకు పుడుతుందని తెలిపారు. దీంతో వారి వ్యాఖ్యలపై కొడాలి నాని తనదైన శైలిలో పైవిధంగా స్పందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com