close
Choose your channels

Kodali Nani: పవన్ మొరిగే కుక్క తప్ప కరిచే కుక్క కాదు... కొడాలి నాని ఘాటు విమర్శలు

Friday, October 6, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్ మొరిగే కుక్క తప్ప కరిచే కుక్క కాదు... కొడాలి నాని ఘాటు విమర్శలు

వారాహి యాత్ర సభలో వైసీపీ ప్రభుత్వం రూపాయి పావలా ప్రభుత్వం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. వైసీపీది రూపాయి పావలా ప్రభుత్వమంటే మా పార్టీకి 125 సీట్లు వస్తాయని పవన్ చెప్పకనే చెప్పారన్నారు. పవన్ కళ్యాణ్‌ని పావలా పవన్ అంటారు.. కాబట్టి టీడీపీ-జనసేన కూటమికి 25 సీట్లే వస్తాయనే అర్థంలో చెప్పి ఉంటారని సెటైర్లు వేశారు. పవన్ మొరిగే కుక్క తప్ప కరిచే కుక్క కాదంటూ ఘాటు విమర్శలు చేశారు.

చంద్రబాబును ప్రజలు క్షమించరు...

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు.. టీడీపీ ఎన్ని డ్రామాలు చేసినా.. గరిటెలు, పళ్లాలు కొట్టినా ప్రజలు క్షమించరని కొడాలి వెల్లడించారు.

పవన్ మొరిగే కుక్క తప్ప కరిచే కుక్క కాదు... కొడాలి నాని ఘాటు విమర్శలు

వైసీపీది రూపాయి పావలా ప్రభుత్వం అని పవన్ విమర్శలు..

అంతకుముందు పెడన బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ వైసీపీది రూపాయి పావలా ప్రభుత్వం అని ప్రజలను ఆకట్టుకోవడానికి వైసీపీ నేతలు రూపాయి పావలా సిద్ధాంతం వాడుతున్నారని విమర్శలు చేశారు. ఓట్లు వేయించుకోవడానికే నవరత్నాలు అని.. పథకాలు అమల్లోకి వచ్చేసరికి అంతా డొల్లాతనమే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ భ్రష్టుపట్టిస్తోందని.. జగన్‌రెడ్డివి వినాశకాలే విపరీత బుద్ధి అని పేర్కొన్నారు. జగన్‌ను శాశ్వతంగా రాజకీయాల్లోకి రాకుండా రాష్ట్రం నుంచి తరిమేయాలని కోరారు. జగన్ కరోనా మహమ్మారిలా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఏపీలో సభ పెట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలోకి రావాలంటే పాస్ పోర్ట్ చూపించాల్సిన పరిస్థితి ఉందన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment