Kodali Nani:ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలన్న బాలకృష్ణకు కొడాలి నాని కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత సీఎం నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలకృష్ణ అక్కడి నిర్వాహకులను ఆదేశించారు. దీంతో బాలయ్య మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ వీడియోపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. అల్లుడు నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలయ్య తొలగిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పెద్ద ఎన్టీఆరును దించిన బాలయ్య.. ఇప్పుడు జూనియర్ ఫ్లెక్సీల మీద పడ్డారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు, బాలకృష్ణ లాంటి వారు వెయ్యిమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని హెచ్చరించారు.
ఓ దుర్మార్గుడి చేతిలో ఎన్టీఆర్ మోసపోయారని.. ఆ మానసిక ఆవేదనతోనే ఆయన చనిపోయారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పనికిరాడన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆయన బూట్లు నాకుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించారు. 'రా.. కదిలి రా' అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతుందని ఎద్దేవా చేశారు. కాగా కొడాలి నాని అడ్డా అయిన గుడివాడలో చంద్రబాబు 'రా..కదిలి రా' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది.
కాగా ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరోసారి నందమూరి కటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. తెల్లవారుజామున జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులర్పించేందుకు వచ్చిన సమయంలో అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే బాలయ్య రాగానే జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసి వెంటనే వాటిని తీయించేయ్ అని అక్కడి నిర్వాహకులను ఆదేశించారు. దీంతో బాలయ్య నివాళులు అర్పించి వెళ్లగానే వారు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసివేశారు. కొంతకాలంగా నందమూరి, నారా కుటుంబాలకు తారక్, కల్యాణ్ రామ్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇద్దరు కనీసం తమ స్పందన తెలియజేయలేదు. అప్పటి నుంచి వీరి మధ్య ఉన్న మనస్పర్థలు తారా స్థాయికి చేరుకున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments