Kodali Nani:నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. టీడీపీకి కొడాలి నాని ఛాలెంజ్..

  • IndiaGlitz, [Monday,November 20 2023]

గుడివాడ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో ముస్లిం సంచారజాతుల బిసి(ఈ) కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి మాట్లాడుతూ టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీడీ హయంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుతం సీఎం జగన్ గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారని గుర్తుచేశారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఆత్మబంధువులుగా చూసే ముఖ్యమంత్రి జగన్ గుడివాడ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి రూ.4వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. రామాయణంలో పిడకల వేటలా పనికిమాలిన టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారని మండిపడ్డారు.

ప్రతి పేద వాడిని తన ఆత్మబంధువుగా భావించే జగన్.. వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాదిరి ఒక్క విడత ఏదైనా పథకం ఆపితే రోడ్ల సమస్యను పరిష్కరించవచ్చని సీఎం జగన్‌కు తాము చెప్పామని.. ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనని ఆయన చెప్పినట్లు వివరించారు. త్వరలో రాష్ట్రంలోని రోడ్ల సమస్య పరిష్కారం అవుతుందని.. గత ప్రభుత్వాలకు భిన్నంగా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇళ్ల వద్దే 99శాతం కుటుంబాల సమస్యలు పరిష్కారంమవుతున్నాయని కొడాలి నాని తెలిపారు.

More News

CP Sandeep Shandilya:హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు గుండెపోటు

హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో

CM KCR:టీడీపీని ఎన్టీఆర్ అందుకే స్థాపించారు: సీఎం కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలతో దూసుకుపోతున్నారు.

Chandrababu:చంద్రబాబుకు భారీ ఊరట.. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయనకు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ

Greater Hyderabad:ఒంటిరిగా గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్థులు.. కీలక నేతల కోసం ఎదురుచూపులు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం తుది దశకు చేరింది. అన్ని పార్టీల నేతలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

CM Jagan:విశాఖ అగ్నిప్రమాదం వెనక ప్రతిపక్షాల కుట్ర.. విచారణకు సీఎం జగన్ ఆదేశాలు..

అందమైన సాగర తీరమైన విశాఖ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.