Kodali Nani:నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. టీడీపీకి కొడాలి నాని ఛాలెంజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
గుడివాడ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో ముస్లిం సంచారజాతుల బిసి(ఈ) కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి మాట్లాడుతూ టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీడీ హయంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుతం సీఎం జగన్ గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారని గుర్తుచేశారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఆత్మబంధువులుగా చూసే ముఖ్యమంత్రి జగన్ గుడివాడ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి రూ.4వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. రామాయణంలో పిడకల వేటలా పనికిమాలిన టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారని మండిపడ్డారు.
ప్రతి పేద వాడిని తన ఆత్మబంధువుగా భావించే జగన్.. వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాదిరి ఒక్క విడత ఏదైనా పథకం ఆపితే రోడ్ల సమస్యను పరిష్కరించవచ్చని సీఎం జగన్‌కు తాము చెప్పామని.. ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనని ఆయన చెప్పినట్లు వివరించారు. త్వరలో రాష్ట్రంలోని రోడ్ల సమస్య పరిష్కారం అవుతుందని.. గత ప్రభుత్వాలకు భిన్నంగా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇళ్ల వద్దే 99శాతం కుటుంబాల సమస్యలు పరిష్కారంమవుతున్నాయని కొడాలి నాని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com