తాప్సీ డబ్బులు ఎవ‌రు దాస్తారో తెలుసా?

  • IndiaGlitz, [Tuesday,July 23 2019]

హీరోయిన్ల సంపాద‌న కోట్ల‌ల్లో ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వ‌చ్చిన వాళ్లు ఉన్న‌ట్టుండి వ‌చ్చే అంతంత మొత్తాన్ని ఎలా సేవ్ చేసుకుంటారు? వాళ్ల డ‌బ్బుల‌ను వాళ్లే మేనేజ్ చేస్తారా? ఇంకెవ‌రైనా ఉంటారా? అనేది అంద‌రికీ ఆస‌క్తి క‌లిగించే అంశం. తాజాగా ఈ విష‌యం గురించి తాప్సీ నోరు విప్పింది. ''నేను మిడిల్ క్లాస్ నుంచి వ‌చ్చిన అమ్మాయిని. మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ప్ర‌తి రూపాయిని ఎలా కూడ‌బెట్టుకోవాలో చెబుతూ ఉంటారు.

న‌న్ను కూడా మా వాళ్లు అలాగే పెంచారు. అందుకే రూపాయిలు కూడ‌బెట్ట‌డం నాకు బాగా తెలుసు. అలా దాచిన డ‌బ్బుతోనే ఈ మ‌ధ్య ముంబైలో ఫ్లాట్ తీసుకున్నా. మా మ‌నీని మా నాన్న చ‌క్క‌గా ఇన్వెస్ట్ చేస్తారు'' అని అన్నారు. తాప్సీకి ఈ ఏడాది నాలుగు రిలీజ్‌లున్నాయి. వ‌చ్చే ఏడాది కూడా నాలుగు రిలీజ్‌లున్నాయ‌ట‌. వాటిలో సౌత్ ఇండియ‌న్ మూవీ కూడా ఉంద‌ట‌. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్ర‌తి ఏటా సౌత్ ఇండియ‌న్ మూవీ ఒక‌టైనా ఉండేలా ఆమె ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

More News

స్ట‌న్నింగ్ 'సాహో ' పోస్ట‌ర్ ని ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్

'బాహుబలి చిత్రం తరువాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నుండి ఏ అప్‌డేట్ వ‌చ్చినా అది సంచ‌ల‌న‌మే అవుతుంది.

ఆ నిర్మాతల వ‌ల్ల న‌ష్ట‌పోయాను : త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌

సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌రద్వాజ స‌మ‌ర్ప‌ణ‌లో ఈమ‌ధ్య తెలుగులో విడులైన చిత్రం `ఆమె`.

‘ఆమె’ చూసి షాకైన తమ్మారెడ్డి.. వారిని తరిమికొట్టాలని పిలుపు!!

కోలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరోయిన్ అమ‌లాపాల్ ప్రధాన పాత్రలో న‌టించిన  థ్రిల్లర్ సినిమా ‘ఆమె’. ఈ చిత్రం ఎన్నో వివాదాలు, నిరసనల మధ్య ఎట్టకేలకు ఈ నెల 19న థియేటర్లలోకి వచ్చేసింది.

కేసీఆర్ ముందే స్టేజ్‌పై హరీశ్ రావు కంటతడి!!

అవును సీఎం కేసీఆర్ ముందే ట్రబుల్ షూటర్, కట్టప్పగా పేరుగాంచిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు.

చంద్రయాన్-2 సక్సెస్.. సత్తా చాటిన భారత్

యావత్ ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న ‘చంద్రయాన్‌-2’ ఎట్టకేలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరింది.