తాప్సీ డబ్బులు ఎవరు దాస్తారో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ల సంపాదన కోట్లల్లో ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్లు ఉన్నట్టుండి వచ్చే అంతంత మొత్తాన్ని ఎలా సేవ్ చేసుకుంటారు? వాళ్ల డబ్బులను వాళ్లే మేనేజ్ చేస్తారా? ఇంకెవరైనా ఉంటారా? అనేది అందరికీ ఆసక్తి కలిగించే అంశం. తాజాగా ఈ విషయం గురించి తాప్సీ నోరు విప్పింది. ``నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయిని. మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ప్రతి రూపాయిని ఎలా కూడబెట్టుకోవాలో చెబుతూ ఉంటారు.
నన్ను కూడా మా వాళ్లు అలాగే పెంచారు. అందుకే రూపాయిలు కూడబెట్టడం నాకు బాగా తెలుసు. అలా దాచిన డబ్బుతోనే ఈ మధ్య ముంబైలో ఫ్లాట్ తీసుకున్నా. మా మనీని మా నాన్న చక్కగా ఇన్వెస్ట్ చేస్తారు`` అని అన్నారు. తాప్సీకి ఈ ఏడాది నాలుగు రిలీజ్‌లున్నాయి. వచ్చే ఏడాది కూడా నాలుగు రిలీజ్‌లున్నాయట. వాటిలో సౌత్ ఇండియన్ మూవీ కూడా ఉందట. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఏటా సౌత్ ఇండియన్ మూవీ ఒకటైనా ఉండేలా ఆమె ప్లాన్ చేసుకుంటున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com