శ్రుతి ఏం చేసిందో తెలుసా
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య స్నేహం చాలా అరుదుగానే ఉంటుంది. అయితే తమన్నా మాత్రం పలువురు హీరోయిన్లతో సఖ్యంగా ఉంటారు. కాజల్, తమన్నా ఇద్దరూ మంచి స్నేహితురాళ్లు. అలాగే శ్రుతిహాసన్, తమన్నా కూడా చాలా మంచి స్నేహితురాళ్లు. ఆ స్నేహం సినిమాల దాకా దారితీసింది. తమన్నా నటిస్తున్న తాజా చిత్రం `ఖామోషీ` కోసం శ్రుతిహాసన్ ఓ పాట పాడారు. చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. థ్రిల్లర్ తరహా చిత్రం. ప్రభుదేవా హీరో. తమన్నా ప్రభుదేవతో కలిసి నటించిన మూడో సినిమా ఇది. టైటిల్ ట్రాక్ ఖామోషీ అంటూ సాగుతుంది.
ఆ పాటను షామిర్ తండన్, శ్రుతి పాడారు. ఈ చిత్రం జూన్ 14న విడుదల కానుంది. ఓ యువతి మిస్టీరియస్ వ్యక్తిని కలిస్తే, ఆ తర్వాత ఏమైంది? ఆమెను అర్థరాత్రి హత్యచేయాలనుకున్న అతని ఆశయం ఏంటి? అనేది ఆసక్తికరం. శ్రుతితో తమన్నాకు ఇదొక్కటే కాదు.. గతంలోనూ సినిమాకు సంబంధించిన అనుబంధం ఒకటి ఉంది.. గతంలో మహేష్, తమన్నా నటించిన `ఆగడు`లో శ్రుతిహాసన్ ఓ ప్రత్యేక పాటకు నృత్యం చేసిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments