నాగులచవితి రోజు నాగ్ టీమ్ ఏం చేసారో తెలుసా..!
Sunday, November 6, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. భక్తిశ్రద్దలతో చిత్రీకరిస్తున్న ఈ షూటింగ్ లో యాధృచ్చికంగా ఓ సంఘటన జరిగింది. అది ఏమిటంటే... వెంకటేశ్వరస్వామి వారి పై గల సన్నివేశాలను అనుకోకుండా నాగులచవితి రోజునే చిత్రీకరించారు. అందులో ప్రత్యేకత ఏమి ఉంది అంటారా..? వెంకటేశ్వరస్వామి పుట్టలో ఉండాల్సి వచ్చే ఓ ఎపిసోడ్ ఈ చిత్రంలో ఉందట. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన సన్నివేశాలను నాగులచవితి రోజున చిత్రీకరించడం యాధృచ్చికంగా జరిగింది అని తెలియచేస్తూ ఓం నమో వేంకటేశాయ టీమ్ ఫోటో ను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments