నాగులచవితి రోజు నాగ్ టీమ్ ఏం చేసారో తెలుసా..!

  • IndiaGlitz, [Sunday,November 06 2016]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో చిత్రీక‌రిస్తున్న ఈ షూటింగ్ లో యాధృచ్చికంగా ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. అది ఏమిటంటే... వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి పై గ‌ల స‌న్నివేశాల‌ను అనుకోకుండా నాగుల‌చ‌వితి రోజునే చిత్రీక‌రించారు. అందులో ప్ర‌త్యేక‌త ఏమి ఉంది అంటారా..? వెంక‌టేశ్వ‌ర‌స్వామి పుట్ట‌లో ఉండాల్సి వ‌చ్చే ఓ ఎపిసోడ్ ఈ చిత్రంలో ఉంద‌ట‌. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన స‌న్నివేశాల‌ను నాగుల‌చ‌వితి రోజున చిత్రీక‌రించ‌డం యాధృచ్చికంగా జ‌రిగింది అని తెలియ‌చేస్తూ ఓం న‌మో వేంక‌టేశాయ టీమ్ ఫోటో ను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసారు. అది సంగ‌తి..!