చరణ్ గురించిన ఈ సీక్రెట్ తెలుసా మీకు
- IndiaGlitz, [Monday,July 17 2017]
చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసిన రామ్ చరణ్‌ను చూసి చాలా మంది గోల్డెన్ స్పూన్ పర్సన్ అని అనుకుంటారు. కానీ చరణ్ సినిమాల్లోకి రావడానికి ముందు చాలా కష్టపడ్డాడట. ఎనిమిదేళ్ల పాటు శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్నాడట. ఈ విషయం బయట చాలా మందికి తెలియదు. కానీ ఈ విషయాన్ని సుక్కు అందరికీ చెప్పేశాడు. రీసెంట్‌గా సుకుమార్ నిర్మాతగా చేసిన సినిమా 'దర్శకుడు'.
ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌కి చరణ్ ముఖ్య అతిథిగా హాజరై యూనిట్‌ను అభినందించాడు. ఈ సందర్భంలో సుకుమార్, చరణ్ సంగీతం నేర్చుకున్న విషయాన్ని అభిమానులకు, ప్రేక్షకులకు చెప్పాడు. చరణ్, చిరంజీవి కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా, మట్టి మనిషి అని, చాలా నేచురల్‌గా ఉంటాడని కూడా సుకుమార్ తెలిపాడు. రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో 'రంగస్థలం1985' సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది జనవరిలో సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.