ర‌ష్య‌న్ డ్రైవ‌ర్ కోసం అనుష్క ఏం చేసిందో తెలుసా?

  • IndiaGlitz, [Friday,March 13 2020]

అనుష్క ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు అవుతుంది. ఈ ఏడాది ఆమె న‌టించిన నిశ్శ‌బ్దం సినిమా కూడా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంలో అనుష్క 15 సంవ‌త్స‌రాల వేడుక జ‌రిగింది. ఇందులో ఆమెతో పాటు ప‌నిచేసిన ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు పాల్గొన్నారు. వారిలో అనుష్క‌ను స్టార్‌ని చేసిన సినిమా అరుంధ‌తి నిర్మాత శ్యాంప్ర‌సాద్ రెడ్డి పాల్గొన్నారు. ఆయ‌న అనుష్క ఎంత మంచి వ్య‌క్తి అని అన‌డ‌మే కాకుండా.. ఆమె మంచిత‌నం గురించి ఓ ఉదాహ‌ర‌ణ‌ను వివ‌రించారు. అనుష్క ఓ సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన‌ప్పుడు అక్క‌డ ఆమెకు జాజ అనే ర‌ష్య‌న్ డ్రైవ‌ర్, కేర్ టేక‌ర్‌ను నియ‌మించారు. నాలుగైదు రోజుల్లో జాజ‌, అనుష్క మంచి స్నేహితుల‌య్యారు.

రెండు వారాల త‌ర్వాత జాజ స్థానంలో మ‌రో డ్రైవ‌ర్ వ‌చ్చాడట‌. అదేంటి.. జాజ ఏమ‌య్యాడు? అని అనుష్క అడిగితే అత‌ను ఫైనాన్స్ తీసుకుని క‌ట్ట‌లేక‌పోవ‌డంతో అత‌ని కారుని ఫైనాన్స్ చేసిన వాళ్లు తీసుకెళ్లిపోయార‌ని చెప్పార‌ట‌. అప్పుడు ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌తో చెప్పి జాజ‌ను వ‌చ్చి త‌న‌ను క‌ల‌వాల‌ని క‌బురు పంపింద‌ట‌. ఆ రోజు సాయంత్రం అనుష్క‌ని జాజ క‌లిశాడ‌ట‌. అత‌న్ని తీసుకుని కారు షోరూంకి వెళ్లి అత‌నికొక కారుని కొనిచ్చింద‌ట అనుష్క‌. అనుష్క పెద్ద మ‌న‌సు చూసి జాజ అత‌ని కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్యంత‌మైయార‌ట‌.

ఈ విష‌యాన్ని అనుష్క ఎవ‌రితోనూ చెప్ప‌లేదు. రీసెంట్‌గా శ్యామ్ ప్ర‌సాద్‌రెడ్డి జార్జియా టూర్‌కి వెళ్లిన‌ప్పుడు అనుకోకుండా అనుష్క కేర్ టేక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన జాజ‌నే.. ఈయ‌న‌కు కూడా డ్రైవ‌ర్ కేర్ టేక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. మాట‌ల క్ర‌మంలో అనుష్క త‌న‌కు చేసిన సాయాన్ని జాజ చెప్పుకొచ్చాడట‌. అనుష్క చేసిన సాయం తెలిసి శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డికి ఆమె పెద్ద మ‌న‌సును అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోయాడ‌ట‌.

More News

బ‌న్నీ సినిమాకు క‌రోనా ఎఫెక్ట్‌... లొకేష‌న్ చేంజ్‌

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన బ‌న్నీ ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

బాల‌య్య ఎటు వైపు మొగ్గుతాడు?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న 106వ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుం సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతుంది.

ఇంత‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్న అనుష్క‌ జ‌న్మ ధ‌న్యం: రాఘ‌వేంద్ర‌రావు

2005 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన 'సూప‌ర్' సినిమాతో ప్రారంభించి న‌టిగా అనుష్క ప్ర‌యాణానికి 15 సంవ‌త్స‌రాలు.

రేవంత్‌కు అధ్యక్ష పదవి కష్టమే.. తొక్కేస్తున్నారే..!?

రేవంత్ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. పరిచయం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.

నెల్లూరు వాసికి కరోనా.. థియేటర్స్ బంద్

ఏపీలో తొలి కరోనా కేసు నెల్లూరు జిల్లాలో నమోదైన సంగతి తెలిసిందే. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో