`RRR` ఫైనాన్సియ‌ర్ ఎవ‌రో తెలుసా?

  • IndiaGlitz, [Friday,January 24 2020]

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'RRR'. 'బాహుబ‌లి' వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంచ‌నాల‌కు ధీటుగా భారీ బ‌డ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో దాన‌య్య‌తో పాటు రాజ‌మౌళి, రామ్‌చ‌ర‌ణ్‌లు స్లీపింగ పార్ట‌న‌ర్స్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నార‌ట‌.

అంతే కాకుండా ఓ ప్ర‌ముఖ ఛానెల్ అధినేత‌, వ్యాపార‌వేత్త కూడా ఇందులో డ‌బ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాడ‌ని అంటున్నారు. సినిమా బిజినెస్ కూడా 600-700 కోట్ల‌ను టార్గెట్‌గా పెట్టుకుని చేస్తున్నార‌ట‌. బాహుబ‌లి సినిమాపై ఉన్న క్రేజ్‌తో సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జ‌రుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఆంధ్రప్రాంత హ‌క్కుల‌ను రూ.100 కోట్ల‌కు అమ్మ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టాక్‌. ఈ చిత్రం ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంద‌ని టాక్‌.

అలాగే తెలంగాణ విప్ల‌వ‌వీరుడు కొమురం భీమ్‌గా తార‌క్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా బ‌ట్ కీల‌క పాత్ర‌ల్లోన‌టిస్తార‌నే సంగ‌తి కూడా తెలిసిందే. ఇంకా స‌ముద్ర‌ఖ‌ని స‌హా హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడ్‌, ఒలివియా మోరిస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

More News

ఫృథ్వీ సరస సంభాషణ ఎఫెక్ట్ : కీలక నిర్ణయం!

సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ ఓ ఉద్యోగినితో ఆయన జరుపుతున్న సరస సంభాషణ ఆడియో వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

చైనాను వణికిస్తున్న పాములు

‘కరోనా’.. ఈ మూడు అక్షరాల పేరుగల వైరస్ పేరు వింటుంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాదు..

మండలి’ రద్దు చేస్తే.. ఈ మంత్రుల సంగతేంటి జగన్..!?

శాసన మండలి రద్దు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే.

కోర్టులో సీఎం జగన్‌కు చుక్కెదురు!

సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి చుక్కెదురైంది. తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విషయమై ప్రతి శుక్రవారం వైఎస్ జగన్..

ఇదే జరిగితే ‘ఈనాడు రామోజీరావు’ జైలుకే..!?

అవును మీరు వింటున్నది నిజమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించిందో.. ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావు జైలుపాలవ్వక తప్పదని..