ట్రైనర్‌కు ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్యాన్ ఇండియా రెబల్‌స్టార్ ప్రభాస్ తన వాళ్లకు అప్పుడప్పుడు గిఫ్టులిస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. తను షూటింగ్లో ఉన్నప్పుడు కూడా ఇంటి దగ్గర నుండే స్పెషల్‌గా భోజనాన్ని రప్పించి తన వాళ్లకు కూడా ఇస్తుంటాడనే పేరు కూడా ఉంది. అలాగే బాగా ఇష్టమైన వ్యక్తులకు ఖరీదైన బహుమతులను ఇస్తుంటారు ప్రభాస్. రీసెంట్గా ప్రభాస్ ఓ వ్యక్తికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ప్రభాస్ ఎవరిని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడో తెలుసా? వివరాల్లోకెళ్తే.. ప్రభాస్‌కు లక్ష్మణ్ అనే ట్రైనర్ ఉన్నాడు. ఈ ట్రైనర్‌కు ప్రభాస్ లక్షల విలువ చేసే రోల్స్ రాయల్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడట. ప్రభాస్‌కు నచ్చితే చాలు.. తన వాళ్ల కోసం ఏమైనా చేయడానికి ఆయన సిద్ధపడుతుంటారు అని ఆయన అభిమానులు అంటున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా సెట్స్‌పై ఉంది. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షనల్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో రామాయణంను ఆదిపురుష్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాముడుగా ప్రభాస్ కనిపించనున్నారు. ఈ మూడు సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలే. వీటితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా, ధూమ్ 4 సినిమా అనౌన్స్మెంట్స్ రానున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com