ప‌వ‌న్ 27 మూవీ బ్యాక్‌డ్రాప్‌కి స్ఫూర్తి ఎవ‌రంటే?

  • IndiaGlitz, [Wednesday,February 12 2020]

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ ముందుకెళుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్‌తో పాటు డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. భారీ సెట్స్‌లో పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌బోయే ఈ సినిమాకు తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పిల‌వ‌డ్డ పండ‌గ‌ల సాయ‌న్న జీవిత‌మే స్ఫూర్తి అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఉన్న‌వారిని కొల్ల‌గొట్టి.. లేనికి పంచేవాడ‌ని, కొన్ని యుద్ధాలు కూడా చేశాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమా కోసం ప‌వ‌న్ కొత్త లుక్‌లో క‌న‌ప‌డుతున్నార‌ని చేతిపై టాటూ కూడా వేసుకున్నార‌ట‌.

య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు, మ‌ణిక‌ర్ణిక చిత్రాల త‌ర్వాత జాగ‌ర్ల‌మూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్ర‌మిది. ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో భారీ సెట్స్ వేసి తెర‌కెక్కిస్తున్నార‌ట‌. పింక్ సినిమా రీమేక్ వ‌కీల్‌సాబ్‌(విన‌ప‌డుతున్న టైటిల్‌) సినిమా షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాతే ప‌వ‌న్ త‌న 27వ సినిమాను షూటింగ్‌లో పాల్గొన్న‌బోతున్నాడ‌ని టాక్‌. ఈ సినిమాలో కియారా అద్వాని, వాణీక‌పూర్‌ల‌ను తీసుకోవాల‌ని నిర్మాత‌లు అనుకుంటున్నార‌ట‌.