`జాను` వల్ల దిల్‌రాజుకి నష్టమెంతో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎంత గొప్ప మేకర్ అయినా కొన్ని సినిమాలను అంచనా వేయడంలో తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా క్లాసిక్ చిత్రాల రీమేక్‌ల విషయంలో ఈ తప్పటడుగులు వేయడానికి మనం చూసే ఉంటాం. ఇప్పుడు తెలుగు చిత్ర సీమలో ప్రముఖ నిర్మాతగా చెప్పుకునే దిల్‌రాజు పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే గత కొన్ని చిత్రాల ఫలితాల విషయంలో ఆయన అంచనాలు తప్పుతున్నాయి. తాజాగా లవ్‌స్టోరి `జాను` ఫలితం ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. తమిళంలో విజయవంతమైన `96` చిత్రాన్ని చూసి నచ్చేయడంతో దిల్‌రాజు తెలుగులోకి రీమేక్ చేయాలనుకున్నాడు. చాలా మంది వద్దని వారించినా దిల్‌రాజు వినిపించుకోలేదు.
శర్వానంద్, సమంత వంటి నటీనటులను పెట్టి `జాను` పేరుతో రీమేక్ చేశాడు. తెలుగు రీమేక్ మంచి టాక్‌ను సంపాదించుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ను రాబట్టుకోవడం మాత్రం విఫలమైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు జాను సినిమా రూ.20కోట్లకు అమ్మాడట దిల్‌రాజు. కానీ కలెక్షన్స్ మాత్రం లేదట. ఇక తనకు ఉన్న పేరుతో డిజిటల్, యూ ట్యూబ్ మార్కెంటింగ్ చేసుకున్నాడట. అంతా కలిపినా దిల్‌రాజుకు రూ.5కోట్లకు పైగానే నష్టం వాటిల్లుతుందట. మరి ఈ నష్టాలను దిల్‌రాజు భర్తీ చేసుకుంటాడోనని అనుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments