2016-2020 మధ్య ఎంతమంది పార్టీ మారారో తెలిస్తే..

  • IndiaGlitz, [Friday,March 12 2021]

దేశవ్యాప్తంగా పార్టీలు మారిన వారిపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఓ సర్వే చేపట్టింది. ముఖ్యంగా 2016-2020 మధ్య జరిగిన వివిధ ఎన్నికల్లో ఏ ఏ పార్టీలకు చెందిన ఎంతమంది పార్టీలు మారారనే దానిపై సమగ్ర నివేదికను అందించింది. పార్టీ మారిన వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండటం విశేషం. మొత్తం 170 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడినట్టు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. అలాగే బీజేపీ నుంచి కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారారని పేర్కొంది.

ఆ నాలుగేళ్లలో మొత్తంగా 433 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారినట్టు వారు సమర్పించిన అఫిడవిట్‌లను విశ్లేషించి ఏడీఆర్‌ తాజా నివేదికను విడుదల చేసింది. నాలుగేళ్లలో జరిగిన వివిధ ఎన్నికల్లో తిరిగి పోటీచేసిన 437 మంది ప్రజాప్రతినిధులు పార్టీలు మారారు. దేశవ్యాప్తంగా 53 పార్టీల నుంచి 405 మంది ఎమ్మెల్యేల్లో 182 మంది తమ పార్టీలు వీడి బీజేపీలోకి, 38 మంది కాంగ్రెస్‌లోకి, 25 మంది టీఆర్‌ఎస్‌లోకి మారారు. వీరిలో తిరిగి 209 మంది విజయం సాధించారు. 2016-19 మధ్యలో ఏడుగురు రాజ్యసభ ఎంపీలు కాంగ్రెస్ పార్టీని వీడారు.

కాగా.. 2016-20 మధ్య మొత్తం 16 మంది రాజ్యసభ సభ్యులు వివిధ పార్టీల నుంచి తిరిగి పోటీచేయగా.. వీరిలో 10 మంది బీజేపీలో చేరిపోయారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఐదుగురు లోక్‌సభ ఎంపీలు బీజేపీని వీడి ఇతర పార్టీల్లోకి చేరారు. మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, గోవా, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటకల్లో ప్రభుత్వాలు కూలిపోవడానికి ప్రజాప్రతినిధులు పార్టీలు మారడమే కారణమని ఏడీఆర్‌ ఆ నివేదికలో స్పష్టం చేసింది. పార్టీల్లో చేరికలకు సంబంధించి టీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. టీడీపీలోకి 11 మంది, వైసీపీలోకి ముగ్గురు చేరి పోటీ చేసినట్లు ఏడీఆర్‌ తెలిపింది.

More News

విశాఖ ఉక్కు పోరుకు మెగాస్టార్ మద్దతు.. తీవ్ర స్థాయిలో విమర్శలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై టాలీవుడ్ తరుఫున మెగాస్టార్ చిరంజీవి స్పందించిన విషయం తెలిసిందే. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన తన గళం విప్పారు.

ఇకపై కొత్త చట్టంతో వస్తున్న సైబరాబాద్ పోలీస్.. తస్మాత్ జాగ్రత్

ఇప్పటి వరకూ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మందు బాబులు మాత్రం మద్యం సేవించి వాహనాలు నడపడం మానడం లేదు. ఎప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినా పెద్ద సంఖ్యలో కార్లు, బైక్స్ పట్టుబడుతూనే ఉన్నాయి.

శివరాత్రి రోజున ‘హరిహర వీరమల్లు’గా పవన్ ఎంట్రీ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సారి ‘హరిహర వీరమల్లు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో రాబోతున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని శివరాత్రి కానుకగా నేడు విడుదల చేశారు.

విశాఖ ఉక్కుకు మద్దతు ప్రకటిస్తూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై టాలీవుడ్ విమర్శలను ఎదుర్కొ&#

అంగారకునిపై హృదయ స్పందన శబ్ధాలు

అంగారక గ్రహం(మార్స్)కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. అంగారక గ్రహంపై జీవ మనుగడ గురించి తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) పంపిన రోవర్ పెర్సెవరెన్స్ అక్కడ