'మనలో ఒకడు' కోసం కె.జె.ఏసుదాస్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్పీ పట్నాయక్ అనగానే శ్రావ్యమైన సంగీతం, మనసును తాకే నటన, మెప్పించగలిగిన దర్శకత్వ ప్రతిభ వరుసబెట్టి గుర్తుకొస్తాయి. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా `మనలో ఒకడు`. ఆయన నటించి, దర్శకత్వం వహించి, సంగీత సారథ్యం చేసిన చిత్రమిది. `మనలో ఒకడు` కోసం ఆర్పీ స్వరపరచిన బాణీని ఇటీవల కె.జె.ఏసుదాస్ ఆలపించడం విశేషం. ఈ చిత్రంలోని పాటల్ని ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జి.సి. జగన్ మోహన్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ``కె.జె.ఏసుదాస్ అనే పేరు వినగానే గంధర్వగానం గుర్తుకొస్తుంది. కొంత విరామం తర్వాత ఆ గానగాంధర్వుడు తెలుగులో పాడిన పాట మా సినిమా కోసం కావడం ఆనందంగా ఉంది. వనమాలి రాసిన `కలి కలి కలికాలం` పాటను ఏసుదాస్‌గారు ఆలపించారు. తప్పకుండా శ్రోతలను అలరిస్తుంది. మరో పాటను చైతన్యప్రసాద్ రాయగా సునీత పాడారు. శ్రావణ భార్గవి గానం చేసిన పెప్పీ నెంబర్‌ను పులగం చిన్నారాయణ రాశారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు ఈ ఆల్బమ్ కుదిరింది`` అని అన్నారు.
నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ - ''కృష్ణమూర్తి అనే సామాన్య లెక్చరర్ కథ ఇది. కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆర్పీ పట్నాయక్ గారు దర్శకత్వం వహించిన 'బ్రోకర్' ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం దాన్ని మించే విధంగా ఉంటుంది. కె.జె.ఏసుదాస్‌గారు, సునీతగారు, శ్రావణ భార్గవిగారు పాటలను చాలా బాగా పాడారు. ఈ నెల 27న ఆడియో విడుదల చేస్తాం'' అని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments