'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' గుమ్మడికాయ వేడుక

  • IndiaGlitz, [Monday,February 27 2017]

యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై 'దొంగాట' ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌'.ఈ సినిమా మార్చి 3న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్ రామానాయుడుస్టూడియోలో గుమ్మ‌డికాయ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా...
కొరొయోగ్రాఫ‌ర్ రాజ సుంద‌రం మాట్లాడుతూ - ''ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నిర్మాత అనీల్ సుంక‌ర‌గారికి టీంకు అభినంద‌నలు'' అన్నారు.
సాయిమాధ‌వ్ బుర్రా మాట్లాడుతూ - ''ద‌ర్శ‌కుడు వంశీకృష్ణతో దొంగాట చిత్రానికి ప‌నిచేశాను. ఇప్పుడు మా కాంబినేష‌న్‌లో ఇది రెండో సినిమా. విభిన్న‌మైన చిత్రం. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌లో, రాజ్ తరుణ్‌తో చేసే తొలి చిత్రం. చాలా కొత్త క‌థ‌. ప్రతి సీన్ విభిన్నంగా ఉంటుంది. ప్ర‌తి డైలాగ్ కొత్త‌గా ఉండాల‌ని ప్ర‌య‌త్నించాను'' అన్నారు.
మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - ''ఎకె ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌లో ఫ‌స్ట్ టైం వ‌ర్క్ చేస్తున్నాను. ఈ సినిమాను వ‌ర్క్ చేయాల‌ని ముందు నుండి అనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. అనీల్ సుంక‌ర‌గారు, కిషోర్ గారు చాలా ప్యాష‌నేట్ నిర్మాత‌లు. పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. వంశీకృష్ణ చూడటానికి క్లాస్‌గా క‌న‌ప‌డ‌తాడు కానీ, చాలా మాస్ డైరెక్ట‌ర్‌. రాజ్ త‌రుణ్ ఓ సాంగ్ రాయ‌డం విశేషం. ఈ సినిమా మంచి ఎంట‌ర్‌టైన‌ర్ అవుతుంది'' అన్నారు.
అను ఇమ్మాన్యుయ‌ల్ మాట్లాడుతూ - ''రాజ్ త‌రుణ్ చాలా హ్య‌పీగా ఉండే హీరో. త‌న‌తో వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. అనీల్‌గారు, కిషోర్‌గారు చాలా మంచి నిర్మాత‌లు. మంచి కంఫ‌ర్ట్ ఎన్విరాన్‌మెంట్‌ను క్రియేట్ చేశారు. అనూప్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. వంశీకృష్ణ‌గారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు'' అన్నారు.
ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ - ''ఈ సినిమా ఎనిమిది నెల‌ల ప్ర‌యాణం. ఈ ప్ర‌యాణంలో ఒక మంచి టీంతో క‌లిసి ట్రావెల్ చేయ‌డాన్ని మ‌ర‌చిపోలేను. ఈ సినిమా నాకు రెండో సినిమా. అంద‌రం డిస్క‌స్ చేసి ఒక క్లారిటీతో సినిమా చేశాం. అనీల్‌గారు, కిషోర్‌గారు స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేయ‌గ‌లిగాం. నేను సినిమా కోసం అడిగిన ప్ర‌తి విష‌యాన్ని అడగ్గానే ఇచ్చారు. రాజ్‌త‌రుణ్‌తో క‌లిసి చేయ‌డం అదృష్టం అనుకుంటున్నాను. సినిమా చూపిస్త మావ సినిమా చూసి త‌న‌లాంటి ఎన‌ర్జిటిక్ స్టార్‌తో చేయాల‌ని అనుకున్నాను. నా కోరిక చాలా త్వ‌రగా తీరింది. రాజ‌శేఖ‌ర్‌గారు ఎంతో స‌పోర్ట్ చేశారు. అనూప్‌గారు బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌'' అన్నారు.
నిర్మాత అనీల్ సుంక‌ర మాట్లాడుతూ - ''ఈ సినిమాలో లాజిక్‌లు క‌న‌ప‌డ‌వు కానీ మ్యాజిక్ ఉంటుంది. ప్రేక్ష‌కులు న‌వ్వుతూనే ఉంటారు. ప్ర‌తి సీన్ కొత్త‌గా ఉంటుంది. అంద‌రూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా అను ఇమ్మాన్యుయ‌ల్‌కు నెక్ట్స్ రేంజ్ మూవీ అవుతుంది. ఈడో ర‌కం ఆడోర‌కం త‌ర్వాత రాజ్ త‌రుణ్‌తో చేసిన సినిమా. ఎంతో బాగా స‌పోర్ట్ చేశారు. స్క్రిప్ట్ ప‌రంగా స‌పోర్ట్ చేయ‌డ‌మే కాకుండా, ఈ సినిమా కోసం పాట రాశాడు. పెర్‌ఫార్మెన్స్ ప‌రంగా చాలా డిఫ‌రెంట్‌గా క‌న‌ప‌డ‌తాడు. ఈ సంస్థ‌లో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రూ త‌మ సంస్థ‌గా భావించారు. రాజ‌శేఖ‌ర్ గారు మంచి విజువ‌ల్స్‌, సాయిమాధ‌వ్‌గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. పృథ్వీ, స్నిగ్ధ‌, అనూప్ స‌హా ప్ర‌తి ఒక్క‌రూ 100 ప‌ర్సెంట్ త‌మ‌దిగా భావించి చేశారు అంద‌రికీ థాంక్స్‌'' అన్నారు.
హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ - ''ఒక సంవ‌త్స‌రం ముందు విన్న క‌థ ఇది. విన‌గానే సినిమా చేస్తాన‌ని అనుకున్నాం. చాలా కాంప్లెక్స్ స్క్రిప్ట్‌. దాన్ని చ‌క్క‌గా ప్రెజెంట్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు ఎవ‌రా అని ఆలోచిస్తే అనీల్ గారు వంశీకృష్ణ‌న‌ను తీసుకొచ్చారు. రాజ‌శేఖ‌ర్‌గారు ప్ర‌తి సీన్‌ను ఎంతో గ్రాండ్‌గా చూపించారు. అనూప్ రూబెన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. త‌న‌తో ఎప్ప‌టి నుండో క‌లిసి ప‌ని చేయాల‌నుకుంటున్నాను. ఈ సినిమాకు కుదిరింది. రీ రికార్డింగ్ అద‌రగొట్టారు. ఫ‌స్ట్ కాపీ చూశాను. చాలా బావుంది. సాయిమాధ‌వ్‌బుర్రాగారు అద్భుత‌మైన డైలాగ్స్ రాశారు. పృథ్వీగారు, ర‌ఘుబాబు, నాగబాబుగారు పెద్ద క్యాస్టింగ్‌. ప్ర‌తి సీన్‌ను ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. నాకు తెలిసి సినిమా కోసం చాలా ప్యాష‌న్‌తో ప‌నిచేసే నిర్మాత‌ను చూడ‌లేదు. ఫ్యామిలీ అంతా క‌ల‌సి చూసే చిత్ర‌మిది'' అన్నారు.
రాజ్‌త‌రుణ్‌, అను ఇమ్మాన్యుయ‌ల్‌, నాగ‌బాబు, పృథ్వీ, ర‌ఘుబాబు, రాజా ర‌వీంద్ర‌, తాగుబోతు ర‌మేష్‌, ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి క‌థః శ్రీకాంత్ విస్సా, డైలాగ్స్ః సాయిమాధ‌వ్ బుర్రా, ఎడిట‌ర్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌, ఆర్ట్ః అవినాష్‌, కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గరిక‌పాటి, మ్యూజిక్ః అనూప్ రూబెన్స్‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, ద‌ర్శ‌క‌త్వంః వంశీకృష్ణ‌.