త్వరలో పెద్ద హీరోతో సినిమా : కిట్టు నల్లూరి
Send us your feedback to audioarticles@vaarta.com
తేజస్ హీరోగా నటించిన సినిమా కేటుగాడు ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు కిట్టు నల్లూరి దర్శకత్వం వహించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ``నేను ఉషాకిరణ్ సంస్థలో ఆరేళ్ళు పనిచేశా. దర్శకుడిగా నాకు ఇది తొలి సినిమా. రెండో సినిమాను ఎలా తీయాలో ఈ సినిమా నేర్పింది. కేటుగాడుకి మార్నింగ్ షోకి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో కాస్త కంగారు పడ్డాం. కానీ మెల్లగా సినిమాకి పాజటివ్ టాక్ వచ్చింది.
సోమవారం నుంచి కలెక్షన్లు బాగా పెరిగాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా బావుందని అంటున్నారు. తన బ్యానర్ నిలబడినందుకు మా నిర్మాత కూడా సంతోషంగా ఉన్నారు. తొలి సగంలో సప్తగిరి, రెండో సగంలో మొత్తం సినిమా అందరికీ బాగా కనెక్ట్ అవుతోది. మా హీరో, హీరోయిన్, మొత్తం యూనిట్ బాగా సహకరించింది. ఇదే సంస్థలో ఓ పెద్ద హీరోతో కమర్షియల్ మూవీని చేయబోతున్నాను. దర్శకుడిగా తొలి సినిమాలో 60 శాతం మార్కులు పొందానని ఫీలవుతున్నా. సినిమా విడుదల సమయంలో. సురేష్‌బాబుగారు, కె.ఎస్.రామారావుగారు ఫుల్ సపోర్ట్ చేశారు. నైజామ్ డిస్ట్రిబ్యూటర్ గణేష్ కూడా సపోర్ట్ చేశారు`` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments