త్వ‌ర‌లో పెద్ద హీరోతో సినిమా : కిట్టు న‌ల్లూరి

  • IndiaGlitz, [Tuesday,September 22 2015]

తేజ‌స్ హీరోగా న‌టించిన సినిమా కేటుగాడు ఇటీవ‌ల విడుద‌లైంది. ఈ సినిమాకు కిట్టు న‌ల్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ''నేను ఉషాకిర‌ణ్ సంస్థ‌లో ఆరేళ్ళు ప‌నిచేశా. ద‌ర్శ‌కుడిగా నాకు ఇది తొలి సినిమా. రెండో సినిమాను ఎలా తీయాలో ఈ సినిమా నేర్పింది. కేటుగాడుకి మార్నింగ్ షోకి మిక్స్డ్ రెస్పాన్స్ రావ‌డంతో కాస్త కంగారు ప‌డ్డాం. కానీ మెల్ల‌గా సినిమాకి పాజ‌టివ్ టాక్ వ‌చ్చింది.

సోమ‌వారం నుంచి క‌లెక్ష‌న్లు బాగా పెరిగాయి. డిస్ట్రిబ్యూట‌ర్లు కూడా బావుంద‌ని అంటున్నారు. త‌న బ్యాన‌ర్ నిల‌బ‌డినందుకు మా నిర్మాత కూడా సంతోషంగా ఉన్నారు. తొలి స‌గంలో స‌ప్త‌గిరి, రెండో స‌గంలో మొత్తం సినిమా అంద‌రికీ బాగా క‌నెక్ట్ అవుతోది. మా హీరో, హీరోయిన్‌, మొత్తం యూనిట్ బాగా స‌హ‌క‌రించింది. ఇదే సంస్థ‌లో ఓ పెద్ద హీరోతో క‌మ‌ర్షియ‌ల్ మూవీని చేయ‌బోతున్నాను. ద‌ర్శ‌కుడిగా తొలి సినిమాలో 60 శాతం మార్కులు పొందాన‌ని ఫీల‌వుతున్నా. సినిమా విడుద‌ల స‌మ‌యంలో. సురేష్‌బాబుగారు, కె.ఎస్‌.రామారావుగారు ఫుల్ స‌పోర్ట్ చేశారు. నైజామ్ డిస్ట్రిబ్యూట‌ర్ గ‌ణేష్ కూడా స‌పోర్ట్ చేశారు'' అని అన్నారు.

More News

బ‌న్నితో ఐటం సాంగ్ చేస్తున్న భామ‌..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే.

శివబాలాజీ, అజ‌య్ ప్ర‌ధానపాత్ర‌ల్లో సెప్టెంబ‌ర్ 23 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్

‘ఇది అశోక్‌గాడి ల‌వ్‌స్టోరీ’ సినిమాతో తెరంగేట్రం చేసి ‘ఆర్య, సంక్రాంతి, పోతేపోనీ, చంద‌మామ‌, శంభో శివ’ శంభో వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల వద్ద తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివ బాలాజీ.

రామ్ చ‌ర‌ణ్ మూవీలో విల‌న్ గా న‌టిస్తున్న హీరో..?

రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో దానయ్య ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

'కంచె' వాయిదా పడింది

కంచె విడుదల వాయిదా పడింది.అక్టోబర్ 2కు బదులు ఈ సినిమాను నవంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రామ్ డబ్బింగ్

రామ్ ప్రస్తుతం తన సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు.