ఓ మంచి సినిమా చూసామ‌నే ఫీలింగ్ క‌లిగించే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ నేను..శైల‌జ - డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల‌

  • IndiaGlitz, [Wednesday,December 30 2015]

రామ్, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం నేను..శైల‌జ‌. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించారు. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ లో స్ర‌వంతి ర‌వి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న నేను..శైల‌జ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ కిషోర్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

మీ గురించి...?

చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే బాగా ఇష్టం. మాది తిరుప‌తి. నాన్న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ఉద్యోగం చేసేవారు. నేను బి.కామ్ పూర్తి చేసిన త‌ర్వాత 2005లో హైద‌రాబాద్ వ‌చ్చాను. బి.వి.ఎస్.ర‌వి, కొర‌టాల శివ ద‌గ్గ‌ర రైట‌ర్ గా వ‌ర్క్ చేసాను. ఆత‌ర్వాత కొన్ని సినిమాల‌కు డైరెక్ష‌న్ డిపార్టెమెంట్ లో వ‌ర్క్ చేసాను. త‌మిళ్ లో విల‌య‌తారు త‌డ‌షేరున్ అనే మూవీ డైరెక్ట్ చేసాను. అలాగే తెలుగులో సెకండ్ హ్యాండ్ మూవీ డైరెక్ట్ చేసాను. నేను...శైల‌జ ద‌ర్శ‌కుడిగా నా మూడ‌వ సినిమా.

నేను...శైల‌జ క‌థ ఏమిటి..?

అన‌వ‌స‌ర‌మైన విష‌యాలు గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం..ఆ ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేస్తుంటాం. కానీ..అవ‌స‌ర‌మైన ప్రేమ‌ను ఎందుకు ఎక్స్ ప్రెస్ చేయం అనే క‌థాంశంతో ఈ సినిమాను రూపొందించాను. తండ్రి, కూత‌రు మ‌ధ్య ఉండే ల‌వ్, ఎమోష‌న్ అంతా రియ‌లిస్టిక్ గా ఉంటుంది. ఓ మంచి సినిమా చూసామ‌నే ఫీలింగ్ క‌లిగించే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ నేను...శైల‌జ‌.

నేను..శైల‌జ క‌థ కి స్పూర్తి ఏమిటి..?

నాకు, నా కూతురు కు మ‌ధ్య జ‌రిగిన చిన్న సంఘ‌ట‌న ఆధారంగా ఈ క‌థ త‌యారు చేసాను. నువ్వు నాకు న‌చ్చావ్, నువ్వే నువ్వే త‌ర‌హాలో ఉండే సినిమా ఇది. ఖ‌చ్చితంగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని నా గ‌ట్టి న‌మ్మ‌కం

హీరో రామ్ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

రామ్ డి.జె క్యారెక్ట‌ర్ లో క‌నిపిస్తాడు. అత‌నికి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. చిన్న‌ప్ప‌టి నుంచి ల‌వ్ లో ఫెయిల్ అవుతుంటాడు. హీరోయిన్, హీరోయిన్ ఫాద‌ర్ లైఫ్ లోకి హీరో ఎంట‌ర్ అవుతాడు.ఆత‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది.

హీరోయిన్ కీర్తి సురేష్ గురించి..?

ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ క్యారెక్ట‌ర్ కి చూడ‌డానికి నేచుర‌ల్ గా ఉండాలి. అలా ఉంటే క్యారెక్ట‌ర్ కి క‌నెక్ట్ అవుతారు. అందుచేత హీరోయిన్ క్యారెక్ట‌ర్ కోసం చాలా మందిని చూసాం. ఫైన‌ల్ గా కీర్తి సురేష్ ని సెలెక్టె చేసాం. పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా చాలా బాగా న‌టించింది. ఖ‌చ్చితంగా ఈ సినిమా కీర్తి సురేష్ కి మంచి పేరు తీసుకువ‌స్తుంది.

ట్రైల‌ర్ లో హీరోయిన్ హీరో తో ఐ ల‌వ్ యు బ‌ట్ ఐయామ్ నాట్ ల‌వ్ విత్ యు అనే డైలాగ్ ఉంది. అలా చెప్ప‌డానికి కార‌ణం ఏమిటి..? డైలాగ్స్ ఎలా ఉంటాయి..?

హీరోయిన్ అలా అన‌డానికి కార‌ణం ఏమిట‌నేది ఆడ‌వాళ్ల‌కు బాగా తెలుస్తుంది (న‌వ్వుతూ..) నా బ‌లం డైలాగ్స్ అని నా అభిప్రాయం. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ విష‌యానికి వ‌స్తే...చాలా నేచుర‌ల్ గా ఉంటాయి. ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఆ క్యారెక్ట‌ర్ రియల్ లైఫ్ లో ఎలా రియాక్ట్ అవుతుందో అలాగే డైలాగ్స్ రాసాను. సినిమాటిక్ గా అస‌లు అనిపించ‌వు. నాకు పంచ్ లేయ‌డం ఇష్టం ఉండ‌దు. ఎక్స్ ప్రెస్ చేయ‌డం కొత్త‌గా ఉండాల‌నుకుంటాను.

స‌త్యరాజ్ క్యారెక్ట‌ర్ గురించి..?

ఈ క‌థ రాసుకుంటున్న‌ప్పుడే ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ కి స‌త్య‌రాజ్ అని ద్రుష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. బాహుబ‌లి షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు స‌త్య‌రాజ్ గార్ని క‌ల‌సి క‌థ చెప్పాను. ఫాద‌ర్ , డాట‌ర్ మ‌ధ్య ఉండే ఎమోష‌న్ ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. వెంట‌నే ఓకె చెప్పారు. క్లైమాక్స్ లో ఆయ‌న ఓ డైలాగ్ చెబుతారు. అది అంద‌రికి బాగా న‌చ్చుతుంది.

ఈ సినిమాలో హైలెట్ ఏమిటి..?

డైలాగ్స్, స్ర్కీన్ ప్లే ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయ‌ని నా న‌మ్మ‌కం

ఈ సినిమాకి హ‌రిక‌థ టైటిల్ అనుకున్నారు. త‌ర్వాత నేను..శైల‌జ గా మార్చేరు కార‌ణం..?

హీరో క్యారెక్ట‌ర్ పేరు హ‌రి. ఈ సినిమా క‌థ‌ని హ‌రి చెబుతుంటాడు కాబ‌ట్టి హ‌రి క‌థ అనుకున్నాం. వ‌ర్కింగ్ టైటిల్ గా పెట్టాం. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో...హీరోయిన్ క్యారెక్ట‌ర్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. అందుచేత నేను...శైల‌జ అని పెట్టాం.

దేవిశ్రీ మ్యూజిక్ గురించి..?

ఈ సినిమాలో పాట‌లు కావాల‌ని పెట్టిన‌ట్టు అనిపించ‌వు. అన్ని పాట‌లు సంద‌ర్భానుసారంగా వ‌చ్చేవే. దేవిశ్రీ ఆ సందర్భానికి త‌గ్గ‌ట్టు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా రిలీజ్ త‌ర్వాత పాట‌లు ఇంకా బాగా పాపుల‌ర్ అవుతాయి.

ల‌వ్ స్టోరీస్ చాలా వ‌చ్చాయి కదా..నేను..శైల‌జ ఆడియోన్స్ కి ఎలాంటి ఫీల్ క‌లిగిస్తుంది..?

ఈ సినిమాలో డ్రామా ఎక్కువుగా ఉండ‌దు. కామెడీ కూడా ఏదో కావాల‌ని పెట్టిన‌ట్టు అస‌లు అనిపించ‌దు. నిజ జీవితంలో స‌ర‌దాగా ఎలా ఉంటామో అలాగే ఉంటుంది. నువ్వే కావాలి, నువ్వు నాకు న‌చ్చావ్...సినిమాల త‌ర‌హాలో ఉండే మంచి సినిమా ఇది. సినిమా చూసి బ‌య‌టకి వ‌చ్చిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి సినిమా చూసామ‌నే ఫీల్ క‌లిగిస్తుంది.

More News

Peculiar title for Mahesh, Murugadoss Movie

Superstar Mahesh Babu, who is on a vacation in an undisclosed foreign location for New Year celebrations, is going to resume the shooting of his upcoming movie Brahmotsavam in January first week. Soon after wrapping up this family entertainer, Mahesh would be joining hands with director AR Murugadoss for a new movie.

Nadigar Sangam multistarrer much, much bigger – Vishal

There were reports yesterday that Vishal and Karthi will star for free in the remake of yesteryear super hit ‘Inaintha Kaigal’ to collect funds for the Nadigar Sangam building...

Indian film actresses who dared to refuse 'Kiss' scenes on screen!

A Lip-Lock or ‘Kiss’ in Indian Cinema has become an integral part, in fact, a Bollywood film is incomplete without a hot Chumma! However there are few actors who have refrained from obliging the film director’s demand of doing a ‘Kiss’ scenes.

REVEALED! How filmmaker Shanker discovered Akshay Kumar for playing antagonist in ENTHIRAN 2

Filmmaker Shanker’s upcoming film ENTHIRAN 2 (ROBOT 2) will go down in the history of Indian Cinema as the most talked about film as far as the casting of its lead villain is considered. The movie created a hell lot of suspense, more chilling than an Alfred Hitchcock suspense thriller about the main villain for his upcoming film ENTHIRAN 2 (ROBOT 2).

Kriti Sanon lovely as Grazia cover girl

May your New Year have a beautiful beginning.... And for this catch the latest issue of Grazia. That's what the pretty 'Dilwale' babe says...