'పి.ఎస్.వి.గరుడవేగ 126.18M'లో 'జార్జ్'గా కిషోర్
Send us your feedback to audioarticles@vaarta.com
యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెరపై ప్రేక్షకులను మెప్పించిన డా.రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్‌గా జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం``పి.ఎస్.వి.గరుడవేగ 126.18M``. పూజా కుమార్ హీరోయిన్గా నటిస్తుంది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కిషోర్ అత్యంత బలమైన ప్రతినాయకుడు జార్జ్ పాత్రలో కనపడనున్నారు.
తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ముఖ్యంగా కబాలి,చీకటి రాజ్యం వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో జీవించి మెప్పించిన కిషోర్‌కు ఈ జార్జ్ పాత్ర మైల్‌స్టోన్‌లా నిలిచిపోతుందని యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. కిషోర్ జార్జ్ పాత్ర గురించి చెప్పాలంటే..జార్జ్, రాక్షసుడి మానవ రూపం.. అతని ఆలోచన కపటం, ఒళ్ళు విషం, అతనితో పొత్తే వినాశనం... శారీరకంగా అవిటివాడు కావచ్చు, కానీ మానసికంగా అత్యంత బలవంతుడు, అతని బుద్ధి తో డ్డి కొట్టి గెలవడం అసాధ్యం.. అతనితో బేరానికి దిగలేరు,భయపెట్టి బతకలేరు.. వేటకు దిగిన మృగం కంటే క్రూరుడు... జాలి,దయ,ప్రేమ,కరుణ అతని డిక్షనరీల నే లేవు అనేలా జార్జ్ పాత్ర భారతీయ చలనచిత్ర లో అత్యంత గొప్ప ప్రతినాయకులైన మొగాంబో, గబ్బర్ సింగ్ ని తలపిస్తుంది.
డా.రాజశేఖర్, పూజా కుమార్, అరుణ్ అదిత్, కిషోర్, రవివర్మ, చరణ్ దీప్, నాజన్, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ః శ్రీకాంత్, సినిమాటోగ్రఫీః అంజి, మ్యూజిక్ః శ్రీచరణ్, జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్, నిర్మాతః కోటేశ్వరరాజు, దర్శకత్వంః ప్రవీణ్ సత్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments