పైరసీపై కొత్త చట్టం రాబోతుందా?
- IndiaGlitz, [Saturday,May 23 2020]
సినిమా ఇండస్ట్రీని చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో పైరసీ సమస్య ఒకటి. ఎంత పెద్ద సినిమా అయినా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీకి గురవుతుంది. ఈ పైరసీని అరిట్టడానికి టాలీవుడ్, బాలీవుడ్ సహా అందరూ ఎంతగానో ప్రయత్నించారు. కానీ బలమైన చట్టం లేకపోవడంతో పైరసీ చేసేవారు భయపడటం లేదు. ఈ దీనిపై సినీ పెద్దలు పోరాటం చేయాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఈరోజు సినీ నిర్మాతలందరూ మాట్లాడారు. అది కూడా లైవ్ చాట్‌లో. ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతున్న పైరసీ సమస్యను చెప్పారు.
దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. ‘‘బలమైన చట్టం లేకపోవడం వల్లే పైరసీ ఎక్కువ అవుతుంది. ఐపీసీ, ఐఆర్‌పీసీ చట్టాలను ఇంత వరకు మార్చలేదు. చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం. అందువల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. మార్చిలో బీజేపీ ప్రభుత్వం ఐపీసీ, ఐఆర్‌పీసీ చట్టంలో పెద్ద మార్పులు చేయబోతున్నాం. అందులో పైరసీకి వ్యతిరేకంగా బలమైన చట్టాన్ని తీసుకొస్తాం. సినీ పెద్దలందరూ కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఢిల్లీకి వస్తే హోం శాఖ అధికారులతో చర్చలు జరిపి అసలు పైరసీ చట్టం గురించి మాట్లాడుతాం’’ అన్నారు కిషన్ రెడ్డి.